21
1 అప్పుడు కొత్త✽ ఆకాశం, కొత్త భూమి నాకు కనిపించాయి. మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయాయి✽. సముద్రం ఇక లేదు✽. 2 నేను – యోహానును – పవిత్ర నగరమైన కొత్త జెరుసలం✽ కూడా చూశాను. అది తన భర్తకోసం అలంకరించుకొన్న పెళ్ళికూతురులాగా✽ తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుంచి✽ వస్తూ ఉంది.3 అప్పుడు పరలోకంనుంచి✽ ఒక గొప్ప స్వరం ఇలా చెప్పగా విన్నాను: “ఇదిగో, దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది.✽ ఆయన వారితో నివసిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటూ వారి దేవుడై✽ ఉంటాడు. 4 దేవుడు వారి కళ్ళలో నుంచి✽ కన్నీళ్ళన్నీ తుడిచివేస్తాడు. అప్పటినుంచి చావు, దుఃఖం, ఏడ్పు ఉండవు. నొప్పి కూడా ఉండదు✽. పూర్వమున్న విషయాలు గతించిపోయాయి✽.”
5 సింహాసనం మీద కూర్చునివున్న వ్యక్తి “ఇదిగో, సమస్తం కొత్త చేస్తున్నాను✽” అన్నాడు. ఆయన నాతో “ఈ మాటలు సత్యమైనవి, నమ్మతగినవి✽ గనుక ఇవి వ్రాయి” అన్నాడు.
6 ఆయన✽ నాతో ఇంకా అన్నాడు. “సమాప్తమైంది✽. నేను ‘అల్ఫా’ను ‘ఓమేగ’ను✽, ఆదిని, అంతాన్ని. దప్పి అయిన వ్యక్తికి జీవజల✽ ఊటనుంచి ఉచితంగా✽ ఇస్తాను. 7 జయించే వ్యక్తి✽ అన్నిటికీ వారసుడవుతాడు✽. నేను అతని దేవుణ్ణయి ఉంటాను. అతడు నా కొడుకై ఉంటాడు.
8 ✽“కానీ పిరికివారు✽, విశ్వాసం లేనివారు✽, అసహ్యులు, హంతకులు, వ్యభిచారులు✽, మాంత్రికులు✽, విగ్రహ పూజ చేసేవారు✽, అబద్ధికులంతా✽ అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది రెండో చావు✽.”
9 ఆ చివరి ఏడు ఈతిబాధలతో✽ నిండిన ఏడు పాత్రలు చేతపట్టుకొన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి “ఇటు రా. పెండ్లి కుమార్తెను, అంటే, గొర్రెపిల్ల భార్య✽ను నీకు చూపిస్తాను” అన్నాడు.
10 ✽అప్పుడతడు దేవుని ఆత్మవశుడైన నన్ను ఎత్తయిన గొప్ప పర్వతానికి కొనిపోయాడు, ఆ గొప్ప నగరమైన పవిత్ర జెరుసలం పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుంచి దిగిరావడం నాకు చూపించాడు. 11 అది దేవుని మహిమాప్రకాశం✽ గలది. దానిలోని వెలుగు అత్యంత వెలగల రత్నంలాగా, స్వచ్ఛమైన స్ఫటికాన్ని పోలిన సూర్యకాంత✽ మణిలాగా ఉంది. 12 నగరానికి పన్నెండు ద్వారాలు గల ఎత్తయిన గొప్ప ప్రాకారం ఉంది. ఆ ద్వారాల దగ్గర పన్నెండుమంది దేవదూతలు ఉన్నారు. ఆ ద్వారాలమీద పేర్లు రాసి ఉన్నాయి. ఇస్రాయేల్ ప్రజల పన్నెండు గోత్రాల పేర్లు✽ ఇవి. 13 తూర్పుగా మూడు ద్వారాలు ఉన్నాయి, ఉత్తరంగా మూడు ద్వారాలు, దక్షిణంగా మూడు ద్వారాలు, పడమరగా మూడు ద్వారాలు ఉన్నాయి. 14 నగర ప్రాకారానికి పన్నెండు పునాదులున్నాయి. వాటిమీద గొర్రెపిల్ల పన్నెండుమంది రాయబారుల పేర్లు✽ ఉన్నాయి.
15 నగరం, దాని ద్వారాలు, దాని ప్రాకారం కొలతలు తీసుకోవడానికి నాతో మాట్లాడిన వ్యక్తి దగ్గర బంగారు కొలబద్ద ఉంది. 16 ఆ నగరం నలు చదరంగా ఉంది – దాని పొడుగు దాని వెడల్పు ఒక్కటే. అతడు ఆ కొలబద్దతో నగరం కొలత తీసుకొన్నాడు. దాని కొలత సుమారు రెండువేల రెండు వందల కిలోమీటర్లు✽. దాని పొడుగూ వెడల్పూ ఎత్తూ సమానమే. 17 ✽అతడు దాని ప్రాకారం కూడా కొలత తీసుకొన్నాడు. దాని కొలత మనుషుల కొలత ప్రకారం అంటే ఆ దేవదూత కొలత ప్రకారం నూట నలభై నాలుగు మూరలు.
18 ✽నగర ప్రాకారం నిర్మించినది సూర్యకాంత మణితో. నగరం స్వచ్ఛమైన గాజులాంటి మేలిమి బంగారం. 19 నగర ప్రాకారం పునాదులకు అలంకారంగా అన్ని రకాల ప్రశస్త రత్నాలు ఉన్నాయి. మొదటి పునాది సూర్యకాంతం. రెండోది నీలమణి✽. మూడోది యమునారాయి. నాలుగోది పచ్చ. 20 అయిదోది వైడూర్యం. ఆరోది కెంపు. ఏడోది సువర్ణ రత్నం. ఎనిమిదోది గోమేధికం. తొమ్మిదోది పుష్యరాగం. పదోది సువర్ణ సునీయం. పదకొండోది పద్మరాగం. పన్నెండోది ఊదామణి. 21 ✽దాని పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలు. ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ముత్యం. నగరం వీధి స్వచ్ఛమైన గాజులాంటి మేలిమి బంగారం.
22 ✽నగరంలో ఏ దేవాలయమూ నాకు కనిపించలేదు. దాని దేవాలయం అమిత శక్తిగలవాడూ ప్రభువూ అయిన దేవుడే, గొర్రెపిల్లే. 23 నగరం మీద ప్రకాశించడానికి సూర్యుడూ చంద్రుడూ✽ దానికి అక్కర లేనే లేదు. ఎందుకంటే, దేవుని మహిమాప్రకాశమే దానిలో వెలిగిస్తూ ఉంది. గొర్రెపిల్లే దానికి దీపం✽. 24 ✽దాని వెలుగులో రక్షించబడ్డ జాతులు నడుస్తాయి. నగరంలోకి భూరాజులు తమ వైభవం, ఘనత తీసుకువస్తారు. 25 అక్కడ రాత్రి అంటూ ఏమీ ఉండదు గనుక పగలు దాని ద్వారాలు ఎంత మాత్రమూ మూసి ఉండవు✽. 26 దానిలోకి వారు జాతుల వైభవం, ఘనత తెస్తారు. 27 ✽దానిలోకి అపవిత్రమైనదేదీ,✽ అసహ్య కార్యం చేసేవారూ అబద్ధమాడేవారూ రానే రారు✽. గొర్రెపిల్ల జీవ గ్రంథం✽లో రాసి ఉన్నవారే దానిలో ప్రవేశిస్తారు.