19
1 ఆ సంగతుల తరువాత పరలోకంలో ఉన్న గొప్ప జన సమూహం పెద్ద స్వరం ఇలా చెప్పడం విన్నాను.“హల్లెలూయా✽! రక్షణ, మహిమ, ఘనత, బలప్రభావాలు మన ప్రభువైన దేవునివే✽! 2 ఆయన తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి✽. దాని వ్యభిచారం✽తో భూలోకాన్ని చెడగొట్టిన ఆ మహా వేశ్యకు ఆయన తీర్పు తీర్చాడు. అది తన దాసుల రక్తం ఒలికించిన విషయంలో ఆయన దానికి ప్రతిక్రియ✽ చేశాడు.”
3 మరో సారి వారు “హల్లెలూయా! దాని పొగ యుగయుగాలకు✽ పైకి లేస్తూ ఉంటుంది!” అన్నారు.
4 అప్పుడా ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ✽ సాగిలపడి సింహాసనం మీద కూర్చుని ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తూ “తథాస్తు✽! హల్లెలూయా!” అన్నారు.
5 అప్పుడు సింహాసనం నుంచి✽ ఒక స్వరం ఇలా చెప్పడం వినిపిచ్చింది: “దేవుని దాసులారా! ఆయనంటే భయభక్తులు✽న్న వారలారా!, అల్పులేమీ ఘనులేమీ మీరంతా మన దేవుణ్ణి స్తుతించండి✽.” 6 అప్పుడు పెద్ద జన సమూహం శబ్దమా అన్నట్టు అనేక జల ప్రవాహాల ధ్వనిలాగా, గొప్ప ఉరుముల ధ్వనిలాగా ఇలా చెప్పడం విన్నాను: “హల్లెలూయా! అమిత శక్తిమంతుడూ ప్రభువూ అయిన దేవుడు రాజ్య పరిపాలన✽ చేస్తున్నాడు! 7 ✽ఇప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవం✽ వచ్చింది. ఆయన భార్య తనను సిద్ధం చేసుకొంది✽, గనుక ఆనందిస్తూ సంబరపడుతూ దేవుణ్ణి కీర్తించుదాం.”
8 ప్రకాశమానమైన, శుభ్రమైన, సున్నితమైన బట్టలు తొడుక్కోవడానికి ఆమెకు ఇవ్వడం జరిగింది. ఆ సున్నితమైన బట్టలు పవిత్రుల న్యాయ క్రియలు✽.
9 ఆ దేవదూత “ఇలా రాయి: గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలుపు అందినవారు✽ ధన్యజీవులు✽” అని నాతో అన్నాడు. “ఇవి దేవుని సత్య వాక్కులు✽” అని కూడా నాతో అన్నాడు.
10 ✽అందుకు నేను అతనికి మ్రొక్కడానికి అతని పాదాలముందు పడ్డాను గాని అతడు “వద్దు సుమా!✽ దేవునికే మ్రొక్కు, నేను నీ సహ దాసుణ్ణి, యేసును గురించిన సాక్ష్యం చెపుతున్న నీ సోదరుల తోటి దాసుణ్ణి. ఎందుకంటే యేసును గురించిన సాక్ష్యం దేవుని మూలమైన సందేశ సారం✽” అని నాతో చెప్పాడు.
11 ✽అప్పుడు పరలోకం తెరచి ఉండడం చూశాను. వెంటనే ఒక తెల్లని గుర్రం✽ కనిపించింది. దానిమీద కూర్చుని ఉన్న వ్యక్తి పేరు “నమ్మకమైనవాడు, సత్యవంతుడు✽.” ఆయన న్యాయంతో తీర్పు తీరుస్తూ యుద్ధం చేస్తూ✽ ఉన్నాడు. 12 ఆయన కళ్ళు మంటలలాంటివి✽. ఆయన తలమీద అనేక కిరీటాలు✽ ఉన్నాయి. రాసి ఉన్న పేరు ఒకటి ఆయనకు ఉంది. ఆయనకు తప్ప మరెవ్వరికీ ఆ పేరు తెలియదు✽.
13 ఆయన తొడుక్కొన్న వస్త్రం రక్తంలో ముంచినది✽. ఆయనకు పెట్టిన పేరు “దేవుని వాక్కు✽.”
14 ఆయన వెంట పరలోక సైన్యాలు✽ తెల్లని గుర్రాలమీద వస్తున్నాయి. వారు తొడుక్కొన్నవి శుభ్రమైన సున్నితమైన తెల్లని దుస్తులు.
15 ✝జనాలను కొట్టడానికి✽ ఆయన నోటనుంచి వాడిగల ఖడ్గం బయలువెడలుతూ ఉంది. ఆయన ఇనుప దండం✽తో జనాలను పరిపాలిస్తాడు. ఆయన అమిత శక్తిగల దేవుని తీవ్రమైన ఉగ్రత ద్రాక్షగానుగ తొట్టి✽ తొక్కుతున్నాడు. 16 ఆయన వస్త్రం మీదా ఆయన తొడమీదా ఈ పేరు రాసి ఉంది✽: “రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు✽”.
17 ✽అప్పుడు సూర్యమండలంలో నిలుచున్న ఒక దేవదూతను చూశాను. అతడు కంఠమెత్తి, ఆకాశం మధ్యన ఎగిరే పక్షులన్నిటినీ పిలుస్తూ వాటితో “రండి! గొప్ప దేవుని విందుకు కూడి రండి! 18 రాజుల మాంసం, సైనికాధికారుల మాంసం, బలిష్ఠుల మాంసం, గుర్రాల మాంసం, రౌతుల మాంసం, స్వతంత్రులేమీ బానిసలేమీ ఘనులేమీ అల్పులేమీ – అందరి మాంసం✽ తినడానికి రండి!” అని బిగ్గరగా చెప్పాడు. 19 అప్పుడు, ఆ గుర్రంమీద కూర్చుని ఉన్న వ్యక్తితో, ఆయన సైన్యంతో యుద్ధం చేయడానికి ఆ మృగమూ✽ భూరాజులూ✽ వారి సైన్యాలూ పోగై ఉండడం✽ చూశాను. 20 అయితే ఆ మృగం, వాడితోపాటు వాడి ముందర సూచనకోసమైన అద్భుతాలు✽ చేసిన ఆ కపట ప్రవక్త✽ పట్టబడ్డారు. తమమీద మృగం ముద్ర పడనిచ్చినవారినీ వాడి విగ్రహాన్ని పూజించినవారినీ ఈ కపట ప్రవక్త ఆ అద్భుతాలతో మోసగించేవాడు. ఈ ఇద్దరు గంధకంతో మండుతూ ఉన్న అగ్ని సరస్సు✽లో ప్రాణంతోనే పడవేయబడ్డారు. 21 మిగిలినవారు, ఆ గుర్రంమీద కూర్చుని ఉన్న వ్యక్తి నోటనుంచి బయలువెడలుతున్న ఖడ్గం✽చేత హతమయ్యారు. వారి మాంసం పక్షులన్నీ కడుపారా తిన్నాయి.