17
1 ఏడు పాత్రలు ఉన్న ఆ ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుతూ నాతో ఇలా అన్నాడు: “ఇటు రా. అనేక జలాల మీద✽ కూర్చుని ఉన్న మహా వేశ్య✽మీదికి వచ్చే తీర్పు నీకు చూపిస్తాను. 2 ఆ వేశ్యతో భూరాజులు వ్యభిచరించారు✽. దాని వ్యభిచార ద్రాక్షమద్యంచేత భూనివాసులు మత్తిల్లారు✽.”3 అప్పుడతడు దేవుని ఆత్మవశుడైన నన్ను ఎడారి✽లోకి తీసుకుపోయాడు. అక్కడ ఎర్రని మృగంమీద కూర్చుని ఉన్న ఒక స్త్రీ✽ నాకు కనిపించింది. ఆ మృగంమీద✽ అంతటా దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి. దానికి ఏడు తలలూ పది కొమ్ములూ ఉన్నాయి. 4 ఆ స్త్రీ ఊదా, ఎర్రని✽ బట్టలు తొడుక్కొన్నది. బంగారం, విలువైన రాళ్ళు,✽ ముత్యాలు ఆమెకు అలంకారం. ఆమె చేతిలో బంగారు పాత్ర✽ ఒకటి ఉంది. అది అసహ్యమైన వాటితో, ఆమె వ్యభిచార సంబంధమైన మాలిన్యంతో నిండి ఉంది.✽ 5 ఆమె నొసట ఈ పేరు✽ రాసి ఉంది.
రహస్యం✽ – మహా బబులోను✽, వేశ్యలకూ భూలోక అసహ్యమైన వాటికీ✽ తల్లి✽ 6 ఆ స్త్రీ పవిత్రుల రక్తంచేత, యేసు హతసాక్షుల రక్తంచేత మత్తిల్లి✽ ఉండడం చూశాను. ఆమెను చూచి నేను అధిక విస్మయంతో ఆశ్చర్యపడ్డాను.
7 ✽అప్పుడా దేవదూత నాతో ఇలా అన్నాడు: నీవెందుకు ఆశ్చర్యపడ్డావు? ఆ స్త్రీని గురించిన రహస్య సత్యం, ఏడు తలలూ పది కొమ్ములూ ఉండి ఆ స్త్రీని మోస్తున్న మృగాన్ని గురించిన రహస్య సత్యం కూడా వివరిస్తాను. 8 ✽నీవు చూచిన ఆ మృగం పూర్వం ఉంది గాని ఇప్పుడు లేదు✽. అది అగాధంలోనుంచి పైకి వస్తుంది✽, నాశనానికి✽ పోతుంది. పూర్వం ఉండి ఇప్పుడు లేని – అయినా ఉన్న – ఆ మృగాన్ని చూచేటప్పుడు భూనివాసులు, అంటే ప్రపంచానికి పునాది కుదిరినప్పటినుంచి జీవ గ్రంథం✽లో ఎవరి పేర్లు రాసి ఉండలేదో వారు ఆశ్చర్యపోతారు✽.
9 ✽“ఇందుకు జ్ఞానం గల మనసు అవసరం. ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చుని ఉన్న ఏడు కొండలు✽. 10 ✽అంతే కాదు, ఏడుగురు రాజులు ఉన్నారు. వారిలో అయిదుగురు కూలిపోయారు, ఒకడున్నాడు✽, మరొకడు ఇంకా రాలేదు✽. వచ్చినప్పుడు అతడు కొద్ది కాలం✽ ఉండాలి. 11 ✽పూర్వముండి ఇప్పుడు లేని ఆ మృగం ఎనిమిదో రాజు, అయినా ఆ ఏడుగురిలో ఒకడు. అతడు నాశనానికి పోతాడు.
12 ✽“నీవు చూచిన ఆ పది కొమ్ములు వేరే పదిమంది రాజులు. వారికింకా రాజ్యం కలగలేదు. కానీ ఒక్క ఘడియ✽ రాజులుగా ఉండడానికి ఆ మృగంతోపాటు వారికి అధికారం లభిస్తుంది. 13 వీరంతా ఒకే ఉద్దేశం✽ కలిగి తమ బలప్రభావాలూ అధికారమూ మృగానికిస్తారు. 14 వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు✽ గాని గొర్రెపిల్ల వారిని ఓడిస్తాడు.✽ ఎందుకంటే, ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు✽, ఆయనతో ఉన్నవారు✽ పిలుపు అందినవారు, ఎన్నికైనవారు, నమ్మకమైనవారు.”
15 అతడు నాతో ఇంకా అన్నాడు: “నీవు చూచిన జలాలు✽ – వేశ్య కూర్చుని ఉన్న ఆ జలాలు ప్రజలూ జన సమూహాలూ, జాతులూ, ఆయా భాషలవారు.
16 “ఆ మృగం మీద ఆ పది కొమ్ములు చూశావు. అవి ఆ వేశ్యను ద్వేషించి✽ ఆమెను దిక్కులేనిదిగా, దిగంబరంగా చేసి ఆమె మాంసం తిని✽ నిప్పంటించి ఆమెను కాల్చివేస్తాయి✽. 17 ఎందుకంటే తన మాటలు నెరవేరేంతవరకు✽ వారు ఏకీభవించి వారి రాజ్యం ఆ మృగానికివ్వాలనీ తన సంకల్పం✽ నెరవేర్చాలనీ దేవుడు అది వారి హృదయాల్లో✽ ఉంచాడు.
18 ✽“నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులను పరిపాలిస్తూ ఉన్న ఆ మహా నగరమే.”