14
1 ✽ నేనింకా చూస్తూ ఉంటే సీయోను పర్వతం✽ మీద గొర్రెపిల్ల✽ నిలుచుండడం కనిపించింది. ఆయనతో పాటు లక్ష నలభై నాలుగు వేలమంది✽ ఉన్నారు. వారి నొసళ్ళమీద ఆయన తండ్రి పేరు రాసి ఉంది✽. 2 అప్పుడు పరలోకంనుంచి ఒక శబ్దం నాకు వినిపించింది. అది అనేక జలాల ధ్వనిలాంటిది, గొప్ప ఉరుము ధ్వనిలాంటిది. నేను తంతివాద్యాలు✽ వాయిస్తున్నవారి తంతి వాదనం విన్నాను. 3 వారు సింహాసనం ముందర, ఆ నాలుగు ప్రాణుల ముందర, ఆ పెద్దల ముందర కొత్త పాట✽ ఒకటి పాడారు. ఈ లక్ష నలభై నాలుగు వేలమంది తప్ప మరెవ్వరూ ఆ పాట నేర్చుకోలేక✽పోయారు. వీరు భూలోకంలోనుంచి విమోచించ బడ్డవారు✽. 4 వీరు పెళ్ళి కానివారై స్త్రీలతో తమను తాము అపవిత్రం చేసుకోనివారు.✽ గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా సరే వీరు ఆయన వెంటవెళ్తూ ఉన్నారు✽. వీరు మనుషులలో నుంచి విమోచించబడి✽ దేవునికీ గొర్రెపిల్లకూ తొలి పంటగా✽ ఉన్నారు. 5 వీరి నోట ఏ మోసమూ✽ కనబడలేదు. దేవుని సింహాసనం ముందర వీరిలో నిందించతగిన విషయమేమీ లేదు.6 ✽అప్పుడు మరో దేవదూత ఆకాశం మధ్యన ఎగిరిపోతూ ఉండడం నాకు కనిపించింది. అతడు భూమిమీద నివసించేవారికి – ప్రతి దేశంవారికీ ప్రతి జాతికీ ప్రతి భాష మాట్లాడేవారికీ ప్రతి జనానికీ✽ ప్రకటించడానికి శాశ్వత శుభవార్త గలవాడు. 7 అతడు పెద్ద స్వరంతో చెప్పినదేమిటంటే, “దేవునికి భయపడండి✽! ఆయనకు మహిమ చేకూర్చండి✽! ఆయన తీర్పు ఘడియ✽ వచ్చింది! ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ నీళ్ళ ఊటలనూ కలగజేసిన ఆయనను ఆరాధించండి✽!”
8 అతని వెంట మరో దేవదూత వచ్చి ఇలా చెప్పాడు:
“మహా నగరమైన బబులోను✽ కూలిపోయింది! కూలిపోయింది! అది తన వ్యభిచార ఆగ్రహ ద్రాక్షమద్యం✽ జనాలన్నిటికీ తాగించింది!”
9 ✽వారి వెంట మూడో దేవదూత వచ్చి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు:
“ఎవరైనా సరే ఆ మృగాన్నీ వాడి విగ్రహాన్నీ పూజిస్తే, నొసటిమీద గానీ చేతిమీద గానీ వాడి ముద్ర పడనిస్తే 10 ఆ వ్యక్తి దేవుని ఆగ్రహ ద్రాక్షమద్యం త్రాగుతాడు. దానిని దేవుడు తన ఉగ్రత✽ పాత్రలో కల్తీ లేకుండా పోశాడు. అంతే కాక, ఆ వ్యక్తిని పవిత్ర దేవదూతల ముందర, గొర్రెపిల్ల ముందర✽ అగ్నిగంధకాలతో✽ వేధించడం జరుగుతుంది. 11 వారి వేదన సంబంధమైన పొగ యుగయుగాలకు✽ పైకి లేస్తూ ఉంటుంది. మృగాన్నీ వాడి విగ్రహాన్నీ పూజించేవారికీ వాడి పేరు ముద్ర పడనిచ్చినవారికీ రాత్రింబగళ్లు ఏమీ విశ్రాంతి లేదు.”
12 ✝ఇలాంటప్పుడు పవిత్రుల సహనం ఉంది; ఇలాంటప్పుడు దేవుని ఆజ్ఞలూ యేసు విశ్వాస సత్యాలూ పాటించే వారు ఉన్నారు.
13 అప్పుడు పరలోకంనుంచి ఒక స్వరం నాకు వినిపించి “ఈ విధంగా రాయి: ఇప్పటినుంచి✽ ప్రభువులో ఉంటూ చనిపోయేవారు ధన్యులు” అంది. “అవును, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి✽ అనుభవిస్తారు. వారి క్రియలు వారి వెంట వస్తాయి✽” అని దేవుని ఆత్మ చెపుతున్నాడు.
14 నేను చూస్తూ ఉంటే, తెల్లని మేఘం✽, ఆ మేఘం మీద మానవ పుత్రుడిలాంటి✽ వ్యక్తి ఒకరు కూర్చుని ఉండడం నాకు కనిపించింది. ఆయన తలమీద బంగారు కిరీటం✽ ఉంది, ఆయన చేతిలో వాడిగల కొడవలి ఉంది. 15 ✽మరో దేవదూత దేవాలయంలోనుంచి వచ్చి మేఘంమీద కూర్చుని ఉన్న వ్యక్తితో బిగ్గరగా ఇలా అన్నాడు:
“భూమి పంట పండింది, నీవు కోత కోసే కాలం వచ్చింది✽, గనుక నీ కొడవలి పెట్టి కోసుకో.”
16 ✽మేఘంమీద కూర్చుని ఉన్న వ్యక్తి భూమిమీద తన కొడవలి పెట్టాడు. వెంటనే భూమి పంట కోయబడింది.
17 అప్పుడు పరలోకంలో ఉన్న దేవాలయంలోనుంచి మరో✽ దేవదూత వచ్చాడు. ఇతనిదగ్గర కూడా వాడిగల కొడవలి ఉంది. 18 మరో దేవదూత వేదిక✽ దగ్గరనుంచి వచ్చాడు. ఇతడు నిప్పుమీద అధికారం✽ ఉన్నవాడు. ఇతడు వాడిగల కొడవలి గలవానితో పెద్ద స్వరంతో ఇలా అన్నాడు:
“భూమి ద్రాక్షపండ్లు✽ పండాయి✽, గనుక వాడిగల నీ కొడవలి పెట్టి ద్రాక్షచెట్టునుంచి దాని గెలలు కోయండి.”
19 ఆ దేవదూత తన కొడవలి భూమిమీద పెట్టి దాని ద్రాక్ష చెట్టు కోసి దేవుని ఉగ్రత✽ మహా ద్రాక్ష గానుగతొట్టిలో✽ పడవేశాడు. 20 ఆ ద్రాక్ష గానుగ నగరం✽ బయట తొక్కడం✽ జరిగింది. గానుగలోనుంచి రక్తం వచ్చి సుమారు మూడు వందల ఇరవై కిలోమీటర్ల✽ దూరం, గుర్రం కళ్ళెమంత ఎత్తు పారింది.