7
1 ✽ఈ సంగతుల తరువాత నలుగురు దేవదూతలు భూమి నలుమూలలో నిలుచుండడం నాకు కనిపించింది. గాలి భూమి మీద గానీ సముద్రం మీద గానీ ఏ చెట్టు మీద గానీ వీచకుండా ఆ దేవదూతలు భూమి నాలుగు దిక్కుల గాలులను✽ అడ్డగిస్తూ ఉన్నారు.2 ✽అప్పుడు మరో దేవదూత తూర్పు దిక్కు నుంచి పైకి రావడం చూశాను. జీవం గల దేవుని ముద్ర అతనికి ఉంది. భూమికీ సముద్రానికీ హాని చేయడానికి అధికారం పొందిన ఆ నలుగురు దేవదూతలతో అతడు పెద్ద స్వరంతో ఇలా అన్నాడు: 3 “మేము మన దేవుని దాసుల నొసళ్ళమీద ముద్ర వేసేవరకు భూమికీ సముద్రానికీ చెట్లకూ హాని చెయ్యకండి.”
4 ✽ముద్ర పొందినవారి లెక్క నేను విన్నాను – ఇస్రాయేల్ ప్రజల గోత్రాలన్నిటిలో ముద్ర పొందినవారు లక్ష నలభై నాలుగు వేలమంది.
5 యూదా గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు.
రూబేను గోత్రంలో పన్నెండు వేలమంది ముద్రపొందారు.
గాదు గోత్రంలో పన్నెండు వేలమంది ముద్రపొందారు.
6 ఆషేరు గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు.
నఫ్తాలి గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు.
మనష్షే గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు.
7 షిమ్యోను గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు.
లేవీ గోత్రంలో పన్నెండు వేలమంది ముద్రపొందారు.
ఇశ్శాకారు గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు.
8 జెబూలూను గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు.
యోసేపు✽ గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు.
బెన్యామీను గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు.
9 ✽ఈ సంగతుల తరువాత నేను చూస్తూ ఉంటే సింహాసనం ఎదుట✽, గొర్రెపిల్ల ఎదుట గొప్ప జన సమూహం నిలుచుండడం కనిపించింది. వారిని లెక్కించడానికి ఏ మనిషికీ చేతకాదు. వారు అన్ని జాతులలోనుంచీ గోత్రాలలోనుంచీ ప్రజలలోనుంచీ భాషలు✽ మాట్లాడేవారిలోనుంచీ వచ్చినవారు. వారు తెల్లని నిలువుటంగీలు✽ తొడుక్కొన్నవారై మట్టలు✽ చేతపట్టుకొని ఉన్నారు. 10 వారు స్వరమెత్తి బిగ్గరగా ఇలా అన్నారు: “రక్షణ✽ సింహాసనం మీద కూర్చుని ఉన్న మా దేవునికీ గొర్రెపిల్లకూ✽ చెందేది.”
11 దేవదూతలంతా సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ నాలుగు ప్రాణుల✽ చుట్టూ నిలుచున్నారు. సింహాసనం ఎదుట సాష్టాంగపడి✽ దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా అన్నారు:
12 ✝“తథాస్తు✽! మా దేవునికి కీర్తీ మహిమా జ్ఞానమూ కృతజ్ఞతలూ✽ గౌరవమూ ప్రభావమూ బలమూ శాశ్వతంగా ఉంటాయి గాక! తథాస్తు!”
13 అప్పుడు పెద్దలలో ఒకడు జవాబిస్తూ “తెల్లని అంగీలు తొడుక్కొన్న వీరెవరు? ఎక్కడనుంచి వచ్చారు?” అని నాతో అన్నాడు.
14 “అయ్యా, మీకే తెలుసు” అని నేను అతనితో అన్నాను. అప్పుడతడు నాతో అన్నాడు “వీరు మహా బాధకాలంలో✽ నుంచి వచ్చేవారే. గొర్రెపిల్ల రక్తంలో తమ అంగీలు ఉతుక్కొని తెల్లగా చేసుకొన్నారు✽. 15 అందుచేత వారు దేవుని సింహాసనం ఎదుట ఉంటూ, ఆయన ఆలయం✽లో రాత్రింబగళ్ళు ఆయనకు సేవ✽ చేస్తూ ఉన్నారు. సింహాసనంమీద కూర్చుని ఉన్నవాడు వారిమీద తన గుడారం కప్పుతాడు✽. 16 వారికి ఇకనుంచి ఆకలి గానీ దప్పి గానీ ఉండదు✽. ఎండ గానీ మరే తీవ్రమైన వేడి✽ గానీ వారికి తగలదు. 17 ఎందుకంటే, సింహాసనం మధ్యన✽ ఉన్న గొర్రెపిల్ల వారికి కాపరి✽ అయి ఉంటాడు, జీవ జలాల ఊటల✽దగ్గరకు వారిని నడిపిస్తాడు✽. వారి కళ్ళ నుంచి కన్నీరంతా✽ దేవుడు తానే తుడిచివేస్తాడు.”