3
1 సార్దీస్✽లో ఉన్న సంఘం దూత✽కు ఇలా వ్రాయి: దేవుని ఏడు ఆత్మలూ✽ ఏడు నక్షత్రాలూ✽ “ఉన్న వ్యక్తి చెప్పే విషయాలేవంటే, నీ క్రియలు నాకు తెలుసు✽. బ్రతుకుతున్నావనే పేరు నీకుంది గాని నీవు చచ్చినవాడివే✽. 2 మేలుకో✽! నీ క్రియలు దేవుని దృష్టిలో సంపూర్ణమై ఉన్నట్టు నాకు కనబడలేదు గనుక మిగిలినవాటిని✽ దృఢపరచుకో! అవి చావనై ఉన్నాయి. 3 అందుచేత నీవు అంగీకరించినదీ✽ విన్నదీ జ్ఞాపకం చేసుకో✽! దానిని గట్టిగా చేపట్టుకొని✽ పశ్చాత్తాపపడు✽! ఒకవేళ నీవు మేల్కోకపోతే దొంగ వచ్చినట్టు✽ నేను నీమీదికి వస్తాను. నీ మీదికి నేను వచ్చే ఘడియ నీకు తెలిసిపోదు.4 “తమ వస్త్రాలు అపవిత్రం చేసుకోనివారు కొందరు✽ సార్దీస్‌లో కూడా ఉన్నారు. వారు అర్హులు✽ గనుక తెల్లని వస్త్రాలు✽ తొడుక్కొని నాతో కూడా నడుస్తారు.
5 “జయించే వ్యక్తి✽కి తెల్లని వస్త్రాలు తొడగడం జరుగుతుంది. అంతేకాదు, జీవ గ్రంథంలో✽ నుంచి ఆ వ్యక్తి పేరు నేనెంత మాత్రమూ తుడుపు పెట్టను గాని నా తండ్రి సమక్షంలో, ఆయన దూతల సమక్షంలో ఆ వ్యక్తి పేరు ఒప్పుకొంటాను✽.
6 ✝“సంఘాలకు ఆత్మ చెప్పేది చెవిగలవాడు వింటాడు గాక!
7 “ఫిలదెల్ఫియ✽లో ఉన్న సంఘం దూతకు ఇలా వ్రాయి: ఈ విషయాలు చెప్పే వ్యక్తి ఎవరంటే, పవిత్రుడూ సత్యస్వరూపీ✽ దావీదు తాళంచెవి✽ గలవాడూ అయిన వ్యక్తి. ఆయన తెరిచాడూ అంటే ఎవ్వరూ మూయలేరు, మూశాడూ✽ అంటే ఎవ్వరూ తెరవలేరు. 8 నీ క్రియలు నాకు తెలుసు✽. ఇదిగో విను. నీకు కొద్ది బలం ఉంది, నీవు నా వాక్కు ఆచరణలో పెట్టావు. నా పేరు ఎరగననలేదు✽ గనుక నీ ముందర తలుపు తెరచి ఉంచాను✽. దానిని ఎవ్వరూ మూయలేరు.
9 “ఇదిగో విను, తాము యూదులు కాకపోయినా యూదులమే అని అబద్ధమాడుతున్న✽వారిని – అంటే సైతాను సమాజం✽వారిని – బలవంతాన తెచ్చి, అవును వారిని బలవంతాన తెచ్చి నీ పాదాల దగ్గర✽ సాష్టాంగపడి గౌరవించేలా చేస్తాను, నీవంటే నాకు ప్రేమ✽ అని వారికి తెలిసిపోయేలా చేస్తాను. 10 నా ఓర్పు✽ను గురించిన వాక్కు ఆచరణలో పెట్టావు గనుక పరీక్ష ఘడియ✽నుంచి – భూమిమీద నివసించేవారిని పరీక్షించడానికి లోకమంతటి మీదికీ రానై ఉన్న ఆ ఘడియనుంచి – నిన్ను కాపాడుతాను✽.
11 “ఇదిగో విను, నేను త్వరగా✽ వస్తున్నాను. నీ కిరీటం✽ ఎవ్వరూ తీసుకోకుండా నీకున్నదానిని గట్టిగా చేపట్టుకొని ఉండు✽.
12 “జయించే వ్యక్తి✽ని నా దేవుని ఆలయంలో స్తంభంగా✽ చేస్తాను. అతడు దానినుంచి బయటికి ఇంకెన్నడూ వెళ్ళడు. ఆ వ్యక్తిమీద నా దేవుని పేరు✽✽ రాస్తాను, పరలోకంనుంచీ నా దేవుని దగ్గరనుంచీ దిగివచ్చే కొత్త జెరుసలమనే నా దేవుని నగరం పేరు✽ రాస్తాను. నా కొత్త పేరు✽ కూడా ఆ వ్యక్తి మీద రాస్తాను.
13 ✝“సంఘాలకు ఆత్మ చెప్పేది చెవిగలవాడు వింటాడు గాక!
14 “లవొదికయ✽ వారి సంఘం దూత✽కు ఇలా వ్రాయి: ఆమేన్✽, నమ్మకమైన సత్యసాక్షి,✽ దేవుని సృష్టికి మూలమై✽ ఉన్న వ్యక్తి చెప్పే విషయాలేవంటే, 15 నీ క్రియలు నాకు తెలుసు✽. నీవు చల్లగా✽ లేవు, వేడిగా✽ లేవు. నీవు చల్లగా గానీ వేడిగా గానీ ఉండాలని నా కోరిక. 16 నీవు చల్లగా గానీ వేడిగా గానీ ఉండకుండా నులివెచ్చగా✽ ఉన్నావు గనుక నా నోటినుంచి నిన్ను ఉమ్మివేస్తాను✽. 17 ✽నీవంటావు – ‘నేను ధనవంతుణ్ణి, నాకు చాలా ఆస్తిపాస్తులు కలిగాయి, నాకు కొదువ అంటూ ఏమీ లేదు✽.’ నీవే దిక్కుమాలినవాడివి, దురవస్థలో మునిగినవాడివి, దరిద్రుడివి, గుడ్డివాడివి, దిగంబరంగా ఉన్నావు గానీ ఇదంతా నీకు తెలియదు✽. 18 అందుచేత నేను నీకు చెప్పే సలహా ఏమంటే, నీవు ధనవంతుడివయ్యేలా నిప్పులో పుటం వేసిన బంగారం✽ నా దగ్గర కొనుక్కో✽. నీ దిసమొల సిగ్గు కనిపించకుండా తొడుక్కోవడానికి తెల్లని దుస్తులూ✽, చూడగలిగేలా నీ కళ్ళకు మందూ✽ నా దగ్గర కొనుక్కో. 19 నేను ప్రేమించేవారందరినీ✽ మందలించి శిక్షిస్తాను✽. గనుక ఆసక్తి కలిగి పశ్చాత్తాపపడు✽.
20 ✽“ఇదిగో, నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుతూ ఉన్నాను. ఎవరైనా సరే నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను✽. ఆ వ్యక్తితో నేను, నాతో ఆ వ్యక్తి భోజనం చేస్తాం.
21 “నేను జయించి✽ నా తండ్రితోకూడా ఆయన సింహాసనం✽మీద కూర్చుని ఉన్నట్టే, జయించే వ్యక్తి✽ని నాతోకూడా నా సింహాసనం✽మీద కూర్చోనిస్తాను.
22 “సంఘాలకు ఆత్మ చెప్పేది చెవిగలవాడు వింటాడు గాక!”