2
1 “ఎఫెసు✽లో సంఘం దూత✽కు ఇలా వ్రాయి✽: తన కుడిచేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొని ఉన్న వ్యక్తి, ఏడు బంగారు దీప స్తంభాల మధ్య✽ నడుస్తున్న వ్యక్తి చెప్పే విషయాలేవంటే, 2 నీ క్రియలు, నీ ప్రయాస, నీ సహనం నాకు తెలుసు✽. దుర్మార్గులు అంటే నీవు ఓర్చుకోలేవని✽ కూడా నాకు తెలుసు. తాము క్రీస్తు రాయబారులు కాకపోయినా రాయబారులమే అని చెప్పినవారిని పరిశీలించి✽ వారు అబద్ధికులని✽ నీవు పసికట్టావు. 3 నీవు భారం✽భరిస్తూ ఉన్నావు. నీకు సహనం ఉంది. నా పేరుకోసం ప్రయాసపడుతూ ఉన్నావు గాని అలసిపోలేదు✽.4 “అయినా నీ విషయంలో నాకు అభ్యంతరం✽ ఒకటి ఉంది – మొదట నీకున్న ప్రేమ విడిచిపెట్టావు. 5 అందుచేత ఏ స్థితినుంచి క్రిందికి పడిపోయావో✽ జ్ఞాపకం చేసుకో. పశ్చాత్తాపపడి✽ మొదటి పనులు చేయి. లేకపోతే, నీవు పశ్చాత్తాపపడకపోతే, నేను త్వరగా నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోటునుంచి తీసివేస్తాను✽. 6 అయినా ఈ విషయం నీలో ఉంది – నీకొలాయితులు✽ అనేవారి చర్యలు అసహ్యించుకొంటున్నావు. అవంటే నాకు కూడా అసహ్యమే.
7 “సంఘాలకు దేవుని ఆత్మ✽ చెప్పేది చెవి గలవాడు వింటాడు గాక✽! జయించే వ్యక్తికి✽ దేవుని పరమానంద నివాసం✽లో ఉన్న జీవవృక్ష ఫలం✽ తినడానికి ఇస్తాను.
8 “స్ముర్న✽లో ఉన్న సంఘం దూత✽కు ఇలా వ్రాయి: మొదటివాడూ చివరివాడూ✽ చనిపోయి మళ్ళీ బ్రతికినవాడూ✽ అయిన వ్యక్తి చెప్పేవిషయాలేవంటే, 9 నీ పనులు, బాధలు✽, దరిద్రం✽ నాకు తెలుసు✽ – అసలు నీవు ధనవంతుడివే✽! తాము యూదులు కాకపోయినా✽ యూదులమే మేము అని చెప్పినవారి దూషణ కూడా నాకు తెలుసు. వారు సైతాను సమాజం✽. 10 నీకు రాబోయే కష్టాలకు భయపడకు✽. ఇదిగో విను, అపవాద పిశాచం మీలో కొందరిని ఖైదులో వేయించ బోతున్నాడు. ఇది మీ పరీక్ష✽కోసమే. పది రోజులపాటు✽ మీరు బాధలకు గురి అవుతారు. మరణంవరకు నమ్మకంగా ఉండు✽. నీకు జీవ కిరీటం✽ ఇస్తాను.
11 “సంఘాలకు ఆత్మ చెప్పేది చెవి ఉన్నవాడు వింటాడు గాక✽! జయించే వ్యక్తి✽కి రెండో మరణం✽వల్ల ఏమీ హాని కలగదు.
12 “పెర్గము✽లో ఉన్న సంఘం దూత✽కు ఇలా వ్రాయి: పదును గల రెండంచుల ఖడ్గం✽ ఉన్న వ్యక్తి చెప్పే విషయాలేవంటే, 13 నీ పనులు, నీ నివాస స్థలం నాకు తెలుసు✽. అది సైతాను సింహాసనమున్న స్థలం✽. అయినా నీవు నా పేరును గట్టిగా చేపట్టి ఉన్నావు. సైతాను నివాసముంటున్న✽ ఆ స్థలంగా నా నమ్మకమైన సాక్షి✽ అంతిపాస్✽ హతమైన రోజులలో కూడా నాగురించిన విశ్వాసం నీవు కాదనలేదు✽.
14 “అయినా నీ విషయంలో నాకు అభ్యంతరాలు✽ కొన్ని ఉన్నాయి. అవేమంటే, బిలాం✽ బోధన అనుసరించేవారు కొందరు అక్కడ మీ మధ్య ఉన్నారు. అతను విగ్రహాలకు బలి చేసినవాటిని తినేలా, వ్యభిచారం చేసేలా ఇస్రాయేల్ ప్రజలకు ఉరి ఒడ్డాలని బాలాకు✽కు నేర్పాడు. 15 అలాగే నీకొలాయితుల✽ బోధన అనుసరించేవారు కొందరు కూడా మీమధ్య ఉన్నారు. అదంటే నాకు అసహ్యం. 16 కనుక పశ్చాత్తాపపడు✽, లేదా, నేను నీ దగ్గరకు త్వరగా✽ వచ్చి నా నోటి ఖడ్గం✽తో వారిమీద యుద్ధం జరిగిస్తాను✽.
17 “సంఘాలకు ఆత్మ చెప్పేది చెవి ఉన్నవాడు వింటాడు✽ గాక! జయించే వ్యక్తికి తినడానికి మరుగైన మన్నా✽ నేనిస్తాను. ఒక తెల్లని రాయి✽ కూడా ఇస్తాను. ఆ రాయిమీద కొత్త పేరు✽ ఒకటి రాసి ఉంటుంది. అది పొందే వ్యక్తికే ఆ పేరు తెలుస్తుంది గాని మరెవరికీ కాదు.
18 “తుయతైర✽లో ఉన్న సంఘం దూత✽కు ఇలా వ్రాయి: “మంటల్లాంటి కళ్ళూ మెరుస్తున్న కంచులాంటి✽ పాదాలూ ఉన్న దేవుని కుమారుడు✽ చెప్పే విషయాలేవంటే, 19 నీ క్రియలు, ప్రేమ, విశ్వాసం✽, సేవ, నీ సహనం నాకు తెలుసు✽. నీ మొదటి క్రియలకంటే ఇప్పటివి ఎక్కువే✽ అని కూడా నాకు తెలుసు.
20 “అయినా నీ విషయంలో నాకు అభ్యంతరాలు✽ కొన్ని ఉన్నాయి. అవేమంటే తాను ప్రవక్తినని చెప్పుకొంటున్న యెజెబెల్✽ అనే స్త్రీని ఉండనిస్తున్నావు✽. ఆమె నా దాసులకు వ్యభిచారం చేయడానికీ, విగ్రహాలకు బలి చేసినవాటిని తినడానికీ నేర్పుతూ తప్పుదారి పట్టిస్తూ ఉంది. 21 ఆమె వ్యభిచారం గురించి పశ్చాత్తాపపడడానికి ఆమెకు నేను సమయమిచ్చాను✽ గాని ఆమె పశ్చాత్తాపపడలేదు✽.
22 ✽ఇదిగో విను, ఆమెను మంచం పట్టిస్తాను. ఆమెతో వ్యభిచరించిన✽వారు తమ పనుల గురించి పశ్చాత్తాప పడకపోతే వారిని మహా బాధలో త్రోసివేస్తాను. 23 ఆమె పిల్లలను✽ చంపితీరుతాను✽. అంతరంగాలనూ హృదయాలనూ పరిశీలించే వాణ్ణి✽ నేనే అని అప్పుడు అన్ని సంఘాలకూ తెలిసిపోతుంది✽. మీలో ప్రతి ఒక్కరికీ తన క్రియలకు తగిన దానిని✽ ఇస్తాను. 24 అయితే నీతోను తుయతైరలో తక్కిన వారితో, అంటే ఆ బోధన అంగీకరించకుండా, వారు చెప్పుకొన్న “సైతాను గూఢమైన విషయాలు✽” ఎరగని మీతో నేను చెప్పేదేమంటే, మీ మీద మరే భారం పెట్టను. 25 ✽నేను వచ్చేంతవరకు✽ మీకున్న దానిని గట్టిగా చేపట్టుకోండి.
26 “జయించే వ్యక్తికి✽, అంతంవరకు✽ నా క్రియలు పాటించే వ్యక్తికి జనాలమీద అధికారం ఇస్తాను. 27 అతడు వారిని ఇనుప దండంతో పరిపాలిస్తాడు✽. వారు కుమ్మరి కుండలలాగా ముక్కచెక్కలై పోతారు. తండ్రి నాకు కూడా ఇది ఇచ్చాడు✽. 28 ఇంతేకాదు, ఆ వ్యక్తికి వేకువచుక్క✽ను ఇస్తాను.
29 ✽సంఘాలకు ఆత్మ చెప్పేది చెవి గలవాడు వింటాడు గాక!