3
1 ఇకపోతే, నా సోదరులారా, ప్రభువులో ఆనందించండి✽. ఈ సంగతులే✽ రాయడం నాకు ఆయాసమనిపించదు. మీకిది క్షేమకరం. 2 ✽కుక్కల✽ విషయంలో జాగ్రత్త! దుష్టులైన✽ పనివారి విషయంలో జాగ్రత్త! ఛేదన✽ ఆచరించే వారి విషయంలో జాగ్రత్త! 3 నిజమైన సున్నతి గల వారం మనమే✽! శరీరం మీద నమ్మకం ఏమీ లేకుండా✽ దేవుని ఆత్మ ద్వారా దేవుణ్ణి ఆరాధన✽ చేస్తూ క్రీస్తు యేసులోనే అతిశయంగా✽ ఆనందించేవారం.4 ✽గానీ కావాలంటే నాకు కూడా శరీరసంబంధమైన విషయాల మీద నమ్మకం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా శరీర సంబంధమైన విషయాల మీద నమ్మకం పెట్టుకోవచ్చునని అనుకొంటే, నేను మరి ఎక్కువగా అలా అనుకోవచ్చు. 5 ఎనిమిదో రోజున✽ సున్నతి పొందాను. ఇస్రాయేల్✽ జాతిలో ఒకణ్ణి. బెన్యామీను✽ గోత్రానికి చెందినవాణ్ణి. హీబ్రూవారి సంతానమైన హీబ్రూవాణ్ణి✽. ధర్మశాస్త్రం విషయం పరిసయ్యుణ్ణి✽ అయ్యాను. 6 ఆసక్తి✽ విషయంలో క్రీస్తు సంఘాన్ని హింసించాను. ధర్మశాస్త్రంలో ఉన్న నీతిన్యాయాల విషయంలో నిందకు చోటివ్వనివాణ్ణి✽.
7 ✽కానీ ఏవైతే నాకు లాభకరమో వాటిని క్రీస్తు కోసం నష్టంగా ఎంచుకొన్నాను. 8 అంతేకాదు, నా ప్రభువైన క్రీస్తు యేసును తెలుసుకోవడం✽ అనే శ్రేష్ఠత కోసం సమస్తాన్ని✽ నష్టంగా ఎంచుకొంటున్నాను. క్రీస్తే నాకు లభించాలని అన్నిటినీ ఆయన కోసం నష్టపోయాను✽. వాటిని చెత్తతో సమానంగా ఎంచుకొంటున్నాను. 9 ధర్మశాస్త్ర సంబంధమైన నా సొంత నీతిన్యాయాలు✽ కాక క్రీస్తుమీది విశ్వాసంద్వారానే✽ – నమ్మకాన్ని బట్టి దేవుడు అనుగ్రహించే నీతిన్యాయాలు కలిగి క్రీస్తులో కనబడాలని అలా చేశాను. 10 ఆయన మరణం విషయంలో ఆయనలాగే✽ ఉండి, ఆయననూ, ఆయన సజీవంగా లేవడంలోని బలప్రభావాలనూ✽, ఆయన బాధల సహవాసాన్నీ✽ తెలుసుకోవాలనీ✽, 11 ఏ విధంచేతనైనా నేను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేవాలని✽ నా ఉద్దేశం.
12 ✽ఇదివరకే నేను అదంతా పొందాననీ ఇదివరకే పరిపూర్ణ స్థితి✽కి తేబడ్డాననీ నేననుకోవడం లేదు. గాని, క్రీస్తు యేసు దేనికోసం నన్ను చేపట్టాడో దానినే చేజిక్కించుకోవడానికి దాన్ని వెంటాడుతూ✽ ఉన్నాను. 13 సోదరులారా, ఇదివరకే దానిని చేజిక్కించుకొన్నానని నేననుకోవడం లేదు. గాని, నేను చేస్తూ ఉన్నది ఒకటే✽ – వెనుక ఉన్నవాటిని మరచి✽ ముందున్నవాటిని అందుకోవాలని తీవ్ర ప్రయత్నం✽ చేస్తూ ఉన్నాను. 14 క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు చెందే బహుమతికోసం గురి✽ దగ్గరికే పరుగెత్తుతూ ఉన్నాను.
15 కాబట్టి మనలో ఆధ్యాత్మికంగా ఎదిగిన✽ వారమంతా ఈ మనసుతోనే ఉందాం. మీకు ఏ విషయంలోనైనా వేరే ఆలోచన ఉంటే దేవుడు అది కూడా మీకు వెల్లడి చేస్తాడు✽. 16 ✽ఎలాగైనా ఇది వరకు మనకు లభించిన అవగాహన ప్రకారం ఇదే నియమాన్ని అనుసరించి నడచుకొందాం, ఇదే మనసు కలిగి ఉందాం.
17 సోదరులారా, నన్ను పోలి ప్రవర్తించండి. మేము మీకు ఆదర్శం✽గా ఉన్నాం. ఈ ప్రకారం నడుచుకొనేవారిని కూడా బాగా గమనించండి✽. 18 ఎందుకంటే, క్రీస్తు సిలువకు విరోధులై నడుచుకొనేవారు అనేకులు. వీరిని గురించి మీతో అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు ఏడుస్తూ✽ చెపుతున్నాను. 19 నాశనమే✽ వారి అంతం. వారికి కడుపే✽ దేవుడు. వారు సిగ్గు✽పడవలసిన వాటినే ఘనత అని ఎంచుకొంటున్నారు, లౌకిక విషయాల✽ మీదే మనసు ఉంచుతారు.
20 ✽మనమైతే పరలోక పౌరులం. అక్కడనుంచే ముక్తిప్రదాత, రక్షకుడు వస్తాడని ఆతురతతో ఎదురుచూస్తూ ఉన్నాం. ఆయన ప్రభువైన యేసు క్రీస్తే. 21 ఆయన సమస్తాన్ని తనకు వశం చేసుకోగల✽ బలప్రభావాన్ని ప్రయోగించి తన దివ్య శరీరాన్ని✽ పోలి ఉండేలా మన దీన శరీరాన్ని మార్చివేస్తాడు✽.