2
1 ✽అందుచేత క్రీస్తులో✽ ప్రోత్సాహమేమైనా, ప్రేమ ఓదార్పు✽ ఏమైనా, దేవుని ఆత్మతో సహవాసమేమైనా, వాత్సల్యం, కనికరం✽ ఏమైనా ఉంటే,✽ 2 నా ఆనందాన్ని పూర్తి చేయండి. ఎలాగంటే, మనసులో, ప్రేమలో, హృదయ భావంలో, ఉద్దేశంలో సమైక్యత✽ కలిగి ఉండండి. 3 కక్షచేత✽ గానీ వట్టి డంబంచేత గానీ ఏమీ చేయకండి. దానికి బదులు, మీలో ప్రతి ఒక్కరూ తనకంటే ఇతరులు ఎక్కువవారని✽ వినయంతో ఎంచండి. 4 ✝మీలో ప్రతి ఒక్కరూ సొంత విషయాలు చూచుకోవడం మాత్రమే కాకుండా ఇతరుల విషయాలు కూడా చూడండి.5 ✽క్రీస్తు యేసుకు ఉన్న ఈ మనసు మీరూ కలిగి ఉండండి: 6 ఆయన దేవుని స్వరూపి✽ అయి ఉండి కూడా దేవునితో సమానతను పట్టుకోవలసిన విషయం అనుకోలేదు✽. 7 గానీ ఆయన తనను ఏమీ లేనివాడిలాగా✽ చేసుకొని సేవకుని✽ స్వరూపం ధరించి మనుషుల పోలిక✽లో జన్మించాడు. 8 మనిషి రూపంతో కనిపించినప్పుడు✽ తనను తాను తగ్గించుకొని✽ మరణం పొందడానికి – సిలువ✽ మరణం పొందడానికి కూడా – విధేయుడయ్యాడు✽.
9 ఈ కారణంచేత✽ దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించాడు✽. అన్ని పేరుల కంటే పై పేరు✽ ఆయనకు ఇచ్చాడు. 10 ✽దీనికి ఫలితంగా యేసు పేరు విని పరలోకంలో గానీ, భూమిమీద గానీ, భూమి క్రింద గానీ ఉన్న ప్రతి మోకాలూ వంగుతుంది, 11 తండ్రి అయిన దేవుని మహిమకోసం✽ ప్రతి నాలుకా యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకొంటుంది✽.
12 అందుచేత✽, నా ప్రియ సోదరులారా, మీరు ఎప్పుడూ విధేయులై✽ ఉన్నట్టే, నేనక్కడ ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నా హాజరులేని ఈ సమయంలో మరీ ఎక్కువగా భయంతో, వణకుతో✽ మీ సొంత విముక్తి సఫలత కోసం శ్రమిస్తూ✽ ఉండండి. 13 ✽ ఎందుకంటే దేవుడు తానే తనకిష్టమైన ఉద్దేశం ప్రకారం సంకల్పించడానికీ చేయడానికీ మీలో పని చేస్తూ ఉన్నాడు.
14 ✽మీరు కుటిలమైన వక్రతరం✽ వారిమధ్య నిర్దోషులు, నిష్కపటులు, నిందారహితులైన దేవుని కుమారులుగా ఉండేలా మీరు చేసేదంతా సణుగులూ వివాదాలు లేకుండా చేయండి. 15 వారి మధ్య జీవ వాక్కు✽ గట్టిగా చేతపట్టుకొని ఈ లోకంలో జ్యోతులలాగా✽ ప్రకాశిస్తూ ఉన్నారు. 16 అలాంటప్పుడు నేను వ్యర్థంగా పరుగెత్తలేదనీ, నిష్‌ఫలంగా ప్రయాస పడలేదనీ క్రీస్తు రోజున ఆనందించగలుగుతాను✽.
17 మీ విశ్వాస యజ్ఞం✽ మీద, సేవ మీద నేను పానార్పణంగా✽ పోయబడుతూ ఉన్నా సంతోషంగా ఉండి మీ అందరితో ఆనందిస్తున్నాను. 18 ఆ కారణంచేతే మీరు కూడా సంతోషంగా ఉండి నాతో ఆనందించండి.
19 మీ సంగతులు తెలుసుకోవడం వల్ల నాకు ఉత్సాహం కలగాలని ఉంది గనుక త్వరలో తిమోతి✽ని మీ దగ్గరకు పంపాలని ప్రభువైన యేసులో ఆశిస్తూ ఉన్నాను. 20 అతనిలాగా మీ గురించి వాస్తవమైన శ్రద్ధ వహించేవారు మరెవరూ నా దగ్గర లేరు. 21 ✽అందరూ ఎవరి విషయాలు వారు చూచుకొంటున్నారు గాని, క్రీస్తు యేసు విషయాలు చూడడం లేదు. 22 తిమోతి యోగ్యత రుజువైందనీ తండ్రితో కొడుకు✽లాగా అతడు శుభవార్త ప్రచారంలో నాతో సేవ చేశాడనీ మీకు తెలుసు. 23 ✝అందుచేత నాకు సంభవించబోయేదేమిటో తెలిసిన వెంటనే అతణ్ణి పంపాలని నా ఆశ. 24 నేను కూడా త్వరలో వస్తానని ప్రభువులో నాకు నమ్మకం ఉంది.
25 మీరు పంపినవాడు, నా సోదరుడూ✽ జతపనివాడూ✽, సాటి యోధుడూ✽, నాకు సేవ చేసినవాడూ✽ అయిన ఎపఫ్రోదితస్‌ను తిరిగి మీ దగ్గరకు పంపడం అవసరమను కొన్నాను. 26 ఎందుకంటే మిమ్ములనందరినీ చూడడానికి అతనికి చాలా ఆశ✽ ఉంది. తనకు జబ్బు✽ చేసిన సంగతి మీరు విన్నందుచేత అతడు చాలా విచారపడ్డాడు. 27 అతడు జబ్బుతో చావు బ్రతుకులలో✽ ఉన్నాడు, నిజమే గాని, దేవుడు అతని మీద జాలి చూపాడు. అతని మీద మాత్రమే కాక, నాకు దుఃఖం✽ వెంట దుఃఖం కలగకుండా నామీద కూడా జాలి చూపాడు. 28 ✽గనుక మీరతణ్ణి మళ్ళీ చూచి సంతోషించేలా తద్వారా నా దుఃఖం తగ్గేలా అతణ్ణి ఆతురతతో పంపాను. 29 క్రీస్తు సేవకోసం అతడు చనిపోయే స్థితికి వచ్చాడు. మీరు నాకు ఏ సేవ చేయలేకపోయారో ఆ సేవ చేయడానికి తన ప్రాణాన్ని✽ అపాయంలో పెట్టాడు. 30 కాబట్టి పూర్ణానందంతో ప్రభువులో అతణ్ణి స్వీకరించండి. అలాంటివారిని గౌరవంతో✽ చూడండి.