హగ్గయి
గ్రంథకర్త
హగ్గయి 1:1 ఈ పుస్తక రచయిత హగ్గయి ప్రవక్తగా గుర్తిస్తున్నది. యెరుషలేములోని యూదుల కోసం హగ్గయి నాలుగు సందేశాలను గ్రంథస్థం చేశాడు. హగ్గయి 2:3 ప్రవక్త యెరుషలేము వినాశనానికీ, ప్రవాసానికీ ముందు యెరుషలేమును చూశాడని సూచిస్తున్నది. అంటే అతడు వృద్ధుడు, తన జాతికి పూర్వ వైభవం మళ్ళీ సమకూడాలని చూస్తున్నాడు. చెర తాలూకు హీనస్ధితినుండి తన ప్రజలు కోలుకొని జాతుల మధ్య దేవుని వెలుగుగా తమ అసలైన స్థానాన్ని పొందాలి అని అతని ఆకాంక్ష.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 520
ఇది చెర అనంతర గ్రంథం. అంటే బబులోను చెర తరువాత రాసినది.
స్వీకర్త
తిరిగి వచ్చిన ప్రజలు తమ దేశానికి తిరిగి వచ్చిన తృప్తితో అలా నిర్లిప్తంగా ఉండిపోకుండా ఆలయం నిర్మించడానికి తగిన విశ్వాసం కనపరచాలి. ఆలయ నిర్మాణం, ఆరాధన ప్రారంభం తిరిగి మొదలు పెట్టాలి. ఆలయ నిర్మాణం దిశగా అడుగులు వేస్తే యోహోవా వారిని ఆశీర్వదిస్తాడని వారిని ప్రోత్సాహించడానికి, వచ్చిన శేషప్రజ యోహోవా తమ గత కాలపు తిరుగుబాటును విస్మరించి భావికాలంలో ఆయన వారికి ప్రముఖ స్దానం ఇస్తాడని ప్రోత్సాహించడానికి ఈ పుస్తకం.
ముఖ్యాంశం
ఆలయం పునర్నిర్మాణం
విభాగాలు
1. ఆలయ నిర్మాణానికై పిలుపు. — 1:1-15
2. యెహోవాలో ధైర్యం — 2:1-9
3. జీవనంలో పవిత్రత — 2:10-19
4. భావికాలానికై నిబ్బరం — 2:20-23