జెఫన్యా
గ్రంథకర్త
1:1 లో గ్రంథకర్త తనను “హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జెఫన్యా” అని తనను పరిచయం చేసుకుంటున్నాడు. జెఫన్యా అంటే దేవుని భద్రత కింద ఉన్నవాడు. యిర్మీయాలో ఇతడు యాజకుడుగా కనిపిస్తున్నాడు (21:1; 29:25, 29; 37:3; 52:24). అయితే పైన చెప్పిన జెఫన్యాకు ఇతనికీ సంబంధం లేకపోవచ్చు. జెఫన్యా రాజవంశానికి చెందిన వాడనే వాదం కూడా ఉంది. యెషయా మీకాల తరువాత యూదాపై తాను చెప్పిన ప్రవచనాలను గ్రంథస్థం చేసిన మొదటి ప్రవక్త జెఫన్యాయే.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 641 - 620
యూదా రాజు యెషయా కాలంలో జెఫన్యా ప్రవచించాడని గ్రంథం తెలియజేస్తున్నది (1:1).
స్వీకర్త
దక్షిణ యూదా రాజ్యప్రజలు. అంతటా దేవుని ప్రజలందరికీ.
ప్రయోజనం
జెఫన్యా తీర్పు, ప్రోత్సహం సందేశంలో మూడు ముఖ్య దైవ సిద్దాంతాలున్నాయి. దేవుడు అన్ని జాతుల మీదా సార్వభౌముడు. తీర్పు దినాన దుష్టులకు శిక్ష, న్యాయవంతులకు మెప్పు కలుగుతుంది. పశ్చాత్తాపపడి తనలో నమ్మకం ఉంచిన వారిని దేవుడు దీవిస్తాడు.
ముఖ్యాంశం
యెహోవా దినం
విభాగాలు
1. యెహోవా దినాన రానున్న వినాశనం — 1:1-18
2. ఆశాభావం — 2:1-3
3. జాతుల వినాశనం — 2:4-15
4. యెరుషలేము వినాశనం — 3:1-7
5. ఆశాభావం తిరిగి ఉదయించడం — 3:8-20