2
1 అయితే ఆ ప్రజలలో కపట ప్రవక్తలు✽ కూడా లేకపోలేదు. అలాగే మీలో✽ కూడా కపట ఉపదేశకులుంటారు. వారు వినాశనకరమైన✽ తప్పు సిద్ధాంతాలను దొడ్డి దారిన✽ ప్రవేశపెట్టి తమను కొన్న✽ ప్రభువును కూడా కాదంటారు. తద్వారా తమ మీదికి✽ శీఘ్ర విధ్వంసం తెచ్చుకొంటారు. 2 అంతేగాక, వారి విధ్వంసక మార్గాలను చాలామంది✽ అనుసరిస్తారు. వీరి కారణంగా సత్య మార్గం దూషణకు✽ గురి అవుతుంది. 3 ఆ కపట ఉపదేశకులు అత్యాశపరులై✽ కల్లబొల్లి మాటలు✽ చెపుతూ మీచేత లాభం సంపాదించుకొంటారు. చాలా కాలం క్రిందట వారి గురించిన తీర్పు✽ వృథా కాలక్షేపం చేయడం లేదు. వారి నాశనం నిద్రపోవడం లేదు.4 ✽పాపం చేసిన దేవదూతలను✽ దేవుడు అలా విడిచిపెట్టలేదు గాని పాతాళంలోకి పడద్రోసి దట్టమైన చీకటి సంకెళ్ళకు అప్పగించి తీర్పు✽కోసం ఉంచాడు. 5 ✝అంతేకాక, ఆయన పురాతన లోకాన్ని విడిచిపెట్టకుండా ఆ భక్తిహీనుల లోకంమీదికి జలప్రళయం రప్పించి, నీతిన్యాయాలను ప్రకటించిన✽ నోవహునూ – మొత్తం ఎనిమిది మందిని మాత్రమే కాపాడాడు. 6 ✽ అంతేకాక, ఆయన సొదొమ, గొమొర్రా అనే పట్టణాలకు నాశనం విధించి వాటిని భస్మం చేసి, ఆ తరువాత దైవభక్తి లేకుండా బ్రతికేవారికి వాటిని ఉదాహరణగా✽ చేశాడు. 7 గానీ న్యాయవంతుడైన✽ లోత్‌ను తప్పించాడు. లోత్ ఆ అక్రమకారుల పోకిరీ జీవిత విధానం కారణంగా ఆయాసపడ్డాడు. 8 వారిమధ్య ఆ న్యాయవంతుడు కాపురముంటూ వారిని చూస్తూ వింటూ నీతిమంతమైన తన మనసులో వారి అక్రమ కార్యాల కారణంగా అతడు రోజుల తరబడి ఎంతో బాధపడ్డాడు.
9 ✽అలాంటప్పుడు దైవభక్తి గలవారిని విషమ పరీక్షలలో నుంచి ఎలా తప్పించాలో✽, న్యాయం తప్పినవారిని ఎలా దండిస్తూ✽ తీర్పు✽ రోజుకోసం కావలిలో ఉంచాలో ప్రభువుకు తెలుసు. 10 భ్రష్టమైన దాన్ని కోరి శరీర స్వభావాన్ని✽ అనుసరిస్తూ ప్రభుత్వాన్ని✽ తృణీకరిస్తూ ఉండేవారి విషయంలో ఇది మరీ నిజం. వారు మొండి ధైర్యం గలవారు, విర్రవీగే స్వార్థపరులు. మహనీయులను✽ దూషించడానికి వీరు భయపడరు. 11 ✝వీరికంటే దేవదూతలు ఎక్కువ బలప్రభావాలు గలవారైనా ప్రభు సన్నిధానంలో వారిని దూషించరు, నేరం మోపరు.
12 ✽ వీరైతే తమకు తెలియని విషయాలను గురించి దూషిస్తారు. పట్టుబడి నాశనం కావడానికే పుట్టిన ప్రకృతి సిద్ధమైన, తెలివిలేని మృగాలలాగా✽ ఉన్నారు. తమ భ్రష్టత్వంలో పూర్తిగా నాశనమవుతారు. 13 ✝న్యాయం తప్పిన నడతకు ప్రతిఫలం పొందుతారు. వారు పట్టపగలు✽ సుఖభోగాలలో గడపడం సంతోషం అనుకొంటారు. మీ విందులలో✽ పాల్గొంటూ, తమ మోసాలలో సంతోషిస్తూ ఉన్న వీరు వాటిలో కళంకులు, మచ్చలు. 14 ✽వారి కండ్లు వ్యభిచారం చూపులతో నిండి ఉండి పాపం ఎన్నడూ విడిచిపెట్టలేనివి. వారు నిలకడ లేనివారిని మరులుకొలిపేవారు. అత్యాశ✽ విషయంలో వారికి ఆరితేరిన హృదయం ఉంది. వారు శాపానికి✽ గురి అయిన సంతానం.
15 వారు బెయారు కొడుకు బిలాం✽ మార్గాన్ని అనుసరిస్తూ తిన్నని మార్గం విడిచి✽ తొలగిపోయారు. బిలాంకు అన్యాయ సంపాదన అంటే ప్రీతి. 16 ✝అయితే అతడి అపరాధం కారణంగా అతడికి మందలింపు వచ్చింది. చెప్ప లేని గాడిద మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త వెర్రితనాన్ని✽ అడ్డగించింది.
17 వీరు నీళ్ళు✽ లేని బావులు, పెనుగాలికి కొట్టుకుపోయే మబ్బులు✽. వారికోసం ఉంచబడేది శాశ్వతమైన కటిక చీకటే✽. 18 వారు వ్యర్థంగా కోతలు కోసే గొప్ప మాటలు✽ చెపుతారు, తప్పు దారిన నడుస్తూ ఉన్న వారిలో నుంచి నిజంగా తప్పించుకొన్నవారిని✽ శరీర స్వభావ దురాశలచేత, పోకిరీ పనులచేత మరులుకొలుపుతారు. 19 తామే భ్రష్టత్వానికి బానిసలై✽ ఉండి వారికి స్వేచ్ఛ✽ ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు. ఒక వ్యక్తి తనను వశం చేసుకొన్నదానికి బానిసే అవుతాడు. 20 వారు ప్రభువూ రక్షకుడూ అయిన యేసు క్రీస్తు గురించిన జ్ఞానంవల్ల ఈ లోక కల్మషాల నుంచి తప్పించుకొన్న తరువాత మళ్ళీ వాటిలోనే చిక్కుబడి వాటి వశమైతే✽ వారి చివరి స్థితి మొదటి స్థితికంటే మరీ చెడ్డదవుతుంది✽. 21 ✽న్యాయ మార్గం తెలిసి, తమకు వచ్చిన పవిత్ర ఆజ్ఞ✽నుంచి వారు తొలగిపోవడంకంటే ఆ మార్గం తెలియకపోవడమే వారికి మేలు. 22 ✽కుక్క తన వాంతికి తిరుగుతుంది, కడిగిన పంది బురదలో దొర్లడానికి తిరిగి పోతుంది అనే నిజమైన సామెత ప్రకారం వీరికి సంభవించింది.