2 పేతురు లేఖ
1
1 ✽మన దేవుడూ రక్షకుడూ అయిన యేసు క్రీస్తు నీతిన్యాయాల✽ మూలంగా మాలాగే అమూల్య✽ విశ్వాసం స్వీకరించినవారికి యేసు క్రీస్తు పంపిన రాయబారీ దాసుడూ✽ అయిన సీమోను✽ పేతురు రాస్తున్న సంగతులు. 2 ✝దేవుణ్ణి, మన ప్రభువైన యేసును గురించిన జ్ఞానం ద్వారా మీకు కృప, శాంతి అధికమవుతాయి గాక✽!3 తన మహిమ✽ను సుగుణాన్ని✽ బట్టీ మనలను పిలిచిన✽ ఆయనను✽ తెలుసుకోవడం ద్వారా జీవానికీ భక్తి✽కీ కావలసిన దంతా ఆయన దైవిక బలప్రభావాలు మనకు ఇచ్చాయి. 4 ఆ మహిమ, సుగుణాలను బట్టి ఆయన ఎంతో గొప్ప ప్రశస్తమైన వాగ్దానాలు✽ మనకు అనుగ్రహించాడు. వీటి ద్వారా✽ మీరు లోకంలో దురాశ✽వల్ల కలిగిన భ్రష్టత్వం✽నుంచి తప్పించుకొని✽ దైవిక స్వభావంలో పాలివారు✽ కావాలని ఆయన ఉద్దేశం.
5 ✽ఈ కారణంచేతనే మీరు పూర్ణ శ్రద్ధాసక్తులు కలిగి మీ విశ్వాసం✽తో సుగుణం✽ సమకూర్చుకోండి✽. సుగుణంతో జ్ఞానం✽, 6 జ్ఞానంలో నిగ్రహం✽, నిగ్రహంతో సహనం✽, సహనంతో భక్తి✽, 7 భక్తితో సోదరులపట్ల అనురాగం✽, ఆ అనురాగంతో దైవిక ప్రేమ✽ సమకూర్చుకోండి. 8 ఇవి మీకు ఉండి అధికం అవుతూ✽ ఉంటే మీరు మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో వ్యర్థంగా, నిష్‌ఫలంగా✽ ఉండరు. 9 కానీ ఇవి లేని వ్యక్తి తన గత పాపాలకు శుద్ధి కలిగిన విషయం మరచిపోయిన✽వాడు, గుడ్డివాడు,✽ లేదా, దూరదృష్టి లేనివాడు.
10 అందుచేత, సోదరులారా, దేవుడు మిమ్ములను పిలిచి ఎన్నుకొన్న✽ విషయం నిశ్చయం చేసుకోవడానికి మరెక్కువగా శ్రద్ధాసక్తులు వహించండి. వీటి ప్రకారం నడుచుకొంటూ ఉంటే మీరెన్నడూ తొట్రుపడరు✽. 11 ఈ విధంగా మీకు మన ప్రభువూ రక్షకుడూ అయిన యేసు క్రీస్తు శాశ్వత రాజ్యంలో✽ ప్రవేశం సమృద్ధిగా ఇవ్వడం జరుగుతుంది.
12 కాబట్టి, మీరు ఈ విషయాలు తెలుసుకొని ఉన్న సత్యంలో నిలకడగా✽ ఉన్నా, వీటిని గురించి మీకు ఎప్పుడూ జ్ఞాపకం చేయడానికి✽ నిర్లక్ష్యంగా ఉండను. 13 నా గుడారాన్ని✽ నేను త్వరలో విడిచి పెట్టవలసివస్తుందని నాకు తెలుసు. ఇది మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు స్పష్టం చేశాడు, 14 ✽గనుక ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ మిమ్ములను పురికొల్పడం యుక్తమని నాకు తోస్తున్నది. 15 అంతేకాక, నేను చనిపోయిన తరువాత కూడా ఈ విషయాలు ఎప్పుడూ మీ జ్ఞాపకంలో ఉండేలా శ్రద్ధాసక్తులు✽ తీసుకొంటాను.
16 ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు బలప్రభావాలనూ రాకడనూ గురించి మేము✽ మీకు తెలియజేసి నప్పుడు యుక్తితో కల్పించిన కట్టుకథలను✽ అనుసరించి చెప్పలేదు గాని ఆయన దివ్యత్వం✽ మేము కండ్లారా చూచిన✽ వారం. 17 ✽ “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన అంటే నాకెంతో ఆనందం” అనే ఆ స్వరం మహా దివ్య మహిమ స్థలంనుంచి ఆయనకు వినిపించినప్పుడు తండ్రి అయిన దేవుని చేత ఘనత, మహిమ ఆయనకు కలిగాయి. 18 ✽ ఆయనతో కూడా మేము ఆ పవిత్ర పర్వతం✽ మీద ఉండి పరలోకంనుంచి వచ్చిన ఆ స్వరం విన్నాం.
19 ఇంతే కాదు, నిశ్చయమైపోయిన భవిష్యద్వాక్కు కూడా మనకు ఉంది. అది చీకటిలో✽ వెలుగిస్తున్న దీపంలాంటిది. అరుణోదయమై✽ వేకువచుక్క✽ మీ హృదయంలో ఉదయించేవరకు ఆ వాక్కు✽ ను మీరు పట్టించుకొంటే మీకు మేలు. 20 అయితే మొట్టమొదట మీరు ఇది తెలుసుకోవాలి – లేఖనం✽లోని భవిష్యద్వాక్కుల్లో ఏదీ వ్యక్తిగత వివరణవల్ల అర్థం కాదు. 21 ఎందుకంటే, భవిష్యద్వాక్కు అనేది మానవ ఇష్టాన్ని బట్టి✽ ఎన్నడూ రాలేదు గాని దేవుని పవిత్రులైన మనుషులు పవిత్రాత్మవశులై పలికారు.