4
1 దేవుని ఆత్మ✽ తేటతెల్లంగా చెప్పేదేమంటే, తరువాతి కాలాలలో కొందరు విశ్వాస సత్యాల✽నుంచి తొలగిపోయి మోసపుచ్చే ఆత్మల✽ను, దయ్యాలు నేర్పే సిద్ధాంతాలను లక్ష్యపెడతారు. 2 ✽వారు కపటులై✽ అబద్ధాలు చెపుతారు. వారికి వాతవేయబడ్డ అంతర్వాణి ఉంది. 3 ✽వారు పెళ్ళి వద్దని ఆజ్ఞాపిస్తారు. కొన్ని భోజన పదార్థాలు తినకూడదని ఆదేశిస్తారు. అయితే సత్యం ఎరిగి నమ్మినవారు ఆ భోజన పదార్థాలు కృతజ్ఞతతో✽ పుచ్చుకోవడానికి దేవుడు వాటిని సృజించాడు. 4 దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే✽. కృతజ్ఞతతో పుచ్చుకొంటే అలాంటిది ఏదీ త్రోసివేయతగినది కాదు. 5 ✽ఎందుకంటే దైవ వాక్కు, ప్రార్థన దానిని పవిత్రపరుస్తాయి.6 ఈ సంగతులు సోదరులకు వివరించి చెపితే, నీవు అనుసరిస్తూ వచ్చిన విశ్వాస సిద్ధాంతాలవల్ల, సవ్యమైన ఉపదేశాలవల్ల పెంపారుతూ, యేసు క్రీస్తుకు మంచి సేవకుడివై✽ ఉంటావు. 7 ముసలమ్మల ముచ్చట్లూ✽ లౌకికమైన కల్పిత కథలూ✽ విసర్జించు. దైవభక్తి✽ విషయంలో నీకు నీవే సాధన చేసుకో. 8 శరీర శిక్షణలో కొంచెం ప్రయోజనం ఉంది. దైవభక్తి అయితే అన్ని విషయాలలోనూ ప్రయోజనకరమే. అందులో ఇప్పటి జీవితం గురించీ వచ్చే జీవితం గురించీ వాగ్దానం✽ ఉంది. 9 ఈ మాట విశ్వసనీయం, పూర్తిగా అంగీకరించదగినది. 10 ఈ కారణంచేత ప్రయాసపడుతూ✽ తిరస్కారానికి గురై ఉన్నాం. ఎందుకంటే మనం జీవం గల దేవుని✽మీదే మన నమ్మకం ఉంచాం✽. ఆయన మనుషులందరికీ, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడు✽.
11 ఈ సంగతులు ఆదేశించి✽ నేర్పు. 12 నీ యువ ప్రాయాన్ని✽ బట్టి ఎవరూ నిన్ను చిన్నచూపు చూడనియ్యకు, గాని విశ్వాసులకు నీ మాటలలో, ప్రవర్తనలో, ప్రేమభావంలో, ఆత్మ విషయాలలో నమ్మకంలో, పవిత్రత✽లో ఆదర్శంగా✽ ఉండు. 13 నేను వచ్చేవరకూ దేవుని వాక్కు చదివి వినిపించడం✽లో, ప్రోత్సాహపరచడంలో, ఉపదేశించడంలో శ్రద్ధ వహించు. 14 క్రీస్తుసంఘం పెద్దలు నీమీద చేతులుంచినప్పుడు✽ దేవుని మూలంగా పలికిన మాట✽ ద్వారా నీలో ఉన్న ఆధ్యాత్మిక వరాన్ని✽ నిర్లక్ష్యం✽ చేయకు. 15 ✽ఆ విషయాలమీద మనసు ఉంచి వాటిని అభ్యాసం చేసుకో. అప్పుడు నీ అభివృద్ధి అందరికీ కనబడుతుంది. 16 ✽నీ గురించీ ఉపదేశాల గురించీ పట్టుదలతో జాగ్రత్తగా చూస్తూ ఉండు. అలా చేస్తూ ఉంటే నిన్ను రక్షించుకొంటావు✽. నీ ఉపదేశం విన్నవారిని రక్షిస్తావు✽.