2
1 మొట్టమొదట నేను నిన్ను ప్రోత్సాహపరిచే విషయం ఏమిటంటే, మనుషులందరి కోసం✽ దేవునికి విన్నపాలు, ప్రార్థనలు✽, మనవులు, కృతజ్ఞతలు✽ చేస్తూ ఉండాలి. 2 ✽మనం సంపూర్ణ భక్తి గంబీరత కలిగి నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతికేలా రాజుల కోసం, అధికారులందరి కోసం కూడా అలా చేస్తూ ఉండాలి. 3 ✽ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టిలో అంగీకారమైనది. 4 ✽మనుషులందరూ పాపవిముక్తి పొందాలనీ సత్యాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనీ ఆయన ఇష్టం.5 ఉన్నది ఒకే దేవుడు✽, దేవునికీ మనుషులకూ మధ్యవర్తి✽ ఒక్కడే. ఆయన మానవుడైన క్రీస్తు యేసు. 6 ఆయన అందరి కోసమూ✽ విడుదల వెల✽గా తనను ఇచ్చివేసుకొన్నాడు. దీన్ని గురించిన సాక్ష్యం సరైన సమయం✽లో చెప్పడం జరుగుతుంది. 7 దీనికోసమే నేను చాటించేవాడు✽గా, క్రీస్తు రాయబారిగా, యూదేతర✽ జనాలకు విశ్వాసంలో, సత్యంలో ఉపదేశించేవాడుగా నియమించబడ్డాను. క్రీస్తులో సత్యమే చెపుతున్నాను. నేను అబద్ధమాడడం లేదు.
8 నేను ఆశించేదేమంటే ప్రతి స్థలంలోనూ పురుషులు✽ కోపం✽, కలహభావం లేకుండా పవిత్రమైన చేతులెత్తి✽✽ ప్రార్థన చేయాలి. 9 ✽స్త్రీలు వినయంతో, మట్టుమర్యాదతో తగిన వస్త్రాలు తొడుక్కోవాలని కూడా నా ఆశ. వారు జడలతో, బంగారంతో, ముత్యాలతో, చాలా వెల గల బట్టలతో తమను అలంకరించు కోకూడదు. 10 గాని దైవభక్తిగలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా మంచి క్రియలతోనే అలంకరించుకోవాలి. 11 స్త్రీలు మౌనం✽ వహించి సంపూర్ణమైన అణుకువ✽తో నేర్చుకోవాలి. 12 స్త్రీ నేర్పడానికి✽ గానీ పురుషునిపై అధికారం చెలాయించడానికి గానీ నేను సెలవివ్వను. ఆమె మౌనంగా ఉండాలి. 13 ✽ఎందుకని? మొదట ఆదామును, తరువాత హవను రూపొందించడం జరిగింది. 14 అంతే కాదు, మోసపోయినది ఆదాము కాదు. స్త్రీ మోసపోయి అపరాధంలో పడింది✽. 15 ✽అయినా స్త్రీలు విశ్వాసం, ప్రేమ, పవిత్రత కలిగి మనసు అదుపులో ఉంచుకొంటూ సాగిపోతూ ఉంటే ప్రసూతి సమయంలో ఆమె కాపాడబడుతుంది.