2
1 ఇప్పుడు, సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ✽, ఆయన దగ్గరకు మనం సమకూడడం✽ గురించి ఒక మాట: 2 క్రీస్తు దినం✽ వచ్చిందని ఏదైనా ఆత్మవల్ల వచ్చిన మాటచేత గానీ, వార్తచేత గానీ, మా దగ్గరనుంచి వచ్చినట్టు ఉన్న ఉత్తరంచేత✽ గానీ తొందరపడి మనసులో ఆందోళన చెందకండి, కంగారుపడకండి అని మిమ్ములను వేడుతున్నాం. 3 ఏ విధంచేతనైనా ఎవరూ మిమ్ములను మోసగించకుండా చూచుకోండి✽. మొదట తిరుగుబాటు లేచి “అపరాధ మనిషి” వెల్లడి అయ్యేవరకూ✽ క్రీస్తు దినం రాదు. వాడు నాశనపుత్రుడు✽. 4 ✽“దేవుడు” అనే పేరు ఉన్న ప్రతిదానినీ, మనుషులు పూజించే ప్రతిదానినీ వాడు ఎదిరిస్తూ దానంతటికీ పైగా తనను హెచ్చించుకొంటాడు✽, దేవుడుగా తనను ప్రదర్శించుకొంటూ✽ దేవుడై ఉన్నట్టు దేవుని ఆలయం✽లో కూర్చుంటాడు.5 నేను మీ దగ్గర✽ ఇంకా ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పానని మీకు జ్ఞాపకం లేదా? 6 ✽వాడు తన సొంత కాలంలోనే వెల్లడి అయ్యేలా వాడు ఇప్పుడు రాకుండా అడ్డగిస్తూ ఉన్నదేదో అది మీకు తెలుసు. 7 ఎందుకంటే, న్యాయ విరోధం రహస్య శక్తి ✽ఇప్పటికే పని చేస్తూ ఉంది గాని దానిని అడ్డగించేవాడు తొలగించబడే వరకూ అలా అడ్డగిస్తూనే ఉంటాడు. 8 ✽అప్పుడు ఆ న్యాయ విరోధి వెల్లడి అవుతాడు. వాణ్ణి ప్రభువు తన నోటి ఉపిరితో✽ నాశనం చేస్తాడు, తన రాకడ దర్శన కాంతితో✽ రూపుమాపుతాడు. 9 ✽న్యాయవిరోధి రాకడ సైతాను శక్తికి అనుగుణంగా ఉంటుంది; సామర్థ్యమంతటితో, సూచకమైన క్రియలతో, మోసకరమైన✽ అద్భుతాలతో✽ ఉంటుంది; 10 ✽నశిస్తున్న✽వారి మధ్య భ్రమపరిచే దుర్మార్గమంతటితో ఉంటుంది. ఎందుకంటే, వారు తమకు పాపవిముక్తి కలిగేలా సత్యం గురించిన ప్రేమను స్వీకరించలేదు.
11 ఈ కారణంచేతే వారు ఆ అబద్ధం✽ నమ్మేలా శక్తిమంతమైన భ్రమ వారికి దేవుడు పంపిస్తాడు. 12 ✽సత్యం నమ్మకుండా దుర్మార్గం✽లో సంతోషించేవారందరికీ శిక్షావిధి కలగాలని✽ ఇందులో దేవుని ఉద్దేశం.
13 ప్రభువు ప్రేమిస్తున్న సోదరులారా✽, మేము మీ కోసం దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పవలసినవారం. ఎందుకంటే, తన ఆత్మ పవిత్రపరచే పని ద్వారా✽, మీరు సత్యం నమ్మడం ద్వారా✽ మీకు పాపవిముక్తి లభించాలని దేవుడు మిమ్ములను మొదటినుంచి ఎన్నుకొన్నాడు✽. 14 దానికి, మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమలో పాల్గొనేలా✽ ఆయన మా శుభవార్త✽ ద్వారా మిమ్ములను పిలిచాడు✽. 15 అందుచేత✽, సోదరులారా, నిలకడగా ఉండండి✽. మేము నోటి మాటవల్ల గానీ ఉత్తరంవల్ల గానీ మీకు నేర్పిన సాంప్రదాయ సత్యాలు చేపట్టి ఉండండి.
16 ✽మనలను ప్రేమించి✽ కృపచేత మనకు శాశ్వత ఓదార్పు, మంచి ఆశాభావం✽ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడూ మన ప్రభువైన యేసు క్రీస్తు తానే 17 ప్రతి మంచి పనిలోనూ మాటలోనూ మీ హృదయాలకు ఓదార్పు✽ కలిగించి మిమ్ములను సుస్థిరంగా✽ చేస్తాడు గాక.