2 తెస్సలొనీకవారికి లేఖ
1
1 ✝మన తండ్రి అయిన దేవునిలో, ప్రభువైన యేసు క్రీస్తులో తెస్సలొనీకవారి సంఘానికి పౌలు, సిల్వానస్, తిమోతి రాస్తున్న సంగతులు. 2 ✝తండ్రి అయిన దేవునినుంచీ ప్రభువైన యేసు క్రీస్తు నుంచీ కృప, శాంతి మీకు కలుగుతాయి గాక.3 ✝సోదరులారా, మీ విషయంలో మేము దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పవలసినవారం. ఇది తగినదే. ఎందుకంటే, మీ నమ్మకం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది, మీరంతా ఒకరిపట్ల ఒకరు చూపుతున్న ప్రేమ భావం అధికమవుతూ✽ ఉంది. 4 అందుచేత మీరు భరిస్తూ వచ్చిన అన్ని హింసలలో బాధలలో✽ మీకున్న ఓర్పు, నమ్మకం కారణంగా మేము దేవుని సంఘాలలో అతిశయంగా మాట్లాడుతూ✽ ఉన్నాం. 5 దేవుని న్యాయమైన తీర్పుకు అదంతా రుజువు✽ గా ఉంది. తద్వారా మీరు దేవుని రాజ్యానికి✽ తగినవారుగా✽ లెక్కలోకి వస్తారు. మీరిప్పుడు కడగండ్లు✽ అనుభవిస్తున్నది దేవుని రాజ్యం కోసమే.
6 దేవుడు మిమ్ములను బాధపెట్టినవారికి బాధ అనే ప్రతిఫలమివ్వడం✽ న్యాయమే✽. 7 కష్టాలు అనుభవిస్తున్న మీకు, మాకు కూడా విశ్రాంతి ఇస్తాడు. ప్రభువైన యేసు బలాఢ్యులైన తన దేవదూతలతో✽పాటు పరలోకంనుంచి వెల్లడి అయ్యేటప్పుడు✽ ఇలా జరుగుతుంది.✽ 8 దేవుణ్ణి ఎరుగని✽వారి మీదికీ మన ప్రభువైన యేసు క్రీస్తు శుభవార్తకు లోబడని✽వారి మీదికీ ఆయన అప్పుడు మండుతున్న అగ్ని జ్వాలలతో✽ న్యాయమైన దండన తెస్తాడు✽. 9 వారు ప్రభు సముఖంనుంచీ ఆయన ప్రభావం మహిమ✽ ప్రకాశం నుంచీ వేరైపోయి✽ శాశ్వత నాశనం✽ అనే దండనకు గురి అవుతారు. 10 ఆయన తన పవిత్ర ప్రజ✽లో మహిమ పొందడానికి✽ తనను నమ్మినవారందరిలో ఆశ్చర్య కారణంగా✽ ఉండడానికి ఆ దినంలో వచ్చినప్పుడు✽ ఇలా జరుగుతుంది. మేము మీకు చెప్పిన సాక్ష్యం మీరు నమ్మారు గదా✽. 11 ఈ కారణంచేత మేము మీ కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాం✽. మీకు అందిన పిలుపుకు✽ మిమ్ములను తగినవారుగా✽ మన దేవుడు ఎంచాలనీ ప్రతి మంచి ఉద్దేశాన్నీ నమ్మకం మూలమైన ప్రతి కార్యాన్నీ బలప్రభావాలతో పూర్తి చేయాలనీ✽ మా ప్రార్థన. 12 మన దేవుడూ ప్రభువైన యేసు క్రీస్తూ ప్రసాదించే కృప✽ ప్రకారం మన ప్రభువైన యేసు క్రీస్తు పేరుకు✽ మీలో✽ను, మీకు ఆయనలో✽ను మహిమ కలగాలని మా ఉద్దేశం.