2
1 మీకోసం, లవొదికయ✽ పట్టణంలో ఉన్నవారికోసం, నా ముఖం చూడని వారందరి కోసమూ నేనెంత తీవ్రమైన పోరాటం✽ అనుభవిస్తున్నానో మీరు తెలుసుకోవాలని నా కోరిక. 2 ✽వారి హృదయాలు ప్రేమలో ఏకమై ఉండి✽ ప్రోత్సాహం✽ పొందాలని వారికి అవగాహన✽ సంపూర్ణ నిశ్చయత ఐశ్వర్యమంతా కలగాలనీ, తద్వారా వారు దేవుని రహస్య సత్యం, తండ్రి, క్రీస్తు ఉభయుల విషయమైన రహస్య సత్యం తెలిసిపోవాలనీ పోరాడుతున్నాను. 3 ✽క్రీస్తులో జ్ఞాన వివేకాల నిధులన్నీ మరుగై✽ ఉన్నాయి. 4 ఎవరూ మిమ్ములను తియ్యటి మాటలతో✽ మోసగించకుండా ఇది చెపుతున్నాను. 5 నేను శారీరకంగా హాజరులో లేకపోయినా ఆత్మరీతిగా✽ మీతోకూడా ఉండి, మీ క్రమమైన ప్రవర్తన,✽ క్రీస్తుమీద ఉన్న మీ స్థిర విశ్వాసం✽ తెలిసి ఆనందిస్తూ ఉన్నాను.6 ✽ మీరు ప్రభువైన క్రీస్తు యేసును స్వీకరించిన విధంగానే ఆయనలో నడుచుకొంటూ ఉండండి. 7 ఆయనలో వేరుపారి అభివృద్ధి పొందుతూ✽, మీకు ఉపదేశం వచ్చినట్టే విశ్వాసంలో✽ సుస్థిరమై దానిలో కృతజ్ఞతతో✽ ఉప్పొంగిపోతూ✽ ఉండండి.
8 ఎవ్వడూ వట్టి మోసంద్వారా తత్వశాస్త్రంతో మిమ్ములను దోచుకోకుండా జాగ్రత్త✽! అలాంటిది క్రీస్తుకు అనుగుణమైనది కాదు గాని మనుషుల సాంప్రదాయాలకూ✽ ఈ లోకంలో ఉన్న ప్రాథమిక విషయాలకూ అనుగుణమైనది. 9 ✽ క్రీస్తులోనైతే దేవుని సర్వ సంపూర్ణత శరీర రూపంలో నివసిస్తూ ఉంది. 10 ✽సర్వాధికారానికీ ప్రభుత్వానికీ పై అధికారి✽ అయిన క్రీస్తులో మీరు సంపూర్ణులు.
11 మీ శరీర స్వభావపాపాలను తొలగించడం వల్ల ఆయనలో మీకు “సున్నతి✽” కూడా జరిగింది. ఇది క్రీస్తు జరిగించిన సున్నతి, చేతులతో చేసినది కాదు. 12 మీరు బాప్తిసం✽లో ఆయనతోకూడా పాతిపెట్టబడ్డారు. ఆయనను చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేపిన దేవుని బలప్రభావాలమీద మీరు నమ్మకం✽ పెట్టడం ద్వారా ఆయనతో కూడా సజీవంగా లేపబడ్డారు✽. 13 మీరు మీ అపరాధాలలో, శరీర సంబంధమైన సున్నతి లేని స్థితిలో ఆధ్యాత్మికంగా మరణమై ఉన్నప్పుడు దేవుడు మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు✽. 14 ✝మనకు ప్రతికూలమైన రుణపత్రంగా రాసి ఉన్నదానిని – మనకు విరుద్ధమైన✽ నిర్ణయాలను✽ రద్దుచేసి పూర్తిగా తీసివేసి సిలువకు మేకులతో కొట్టి✽ మన అతిక్రమక్రియలన్నీ క్షమించాడు✽. 15 ప్రధానులనూ అధికారులనూ✽ సిలువమీద జయించి నిరాయుధులను చేసి బహిరంగంగా ప్రదర్శించాడు.
16 ✽అందుచేత అన్నపానాల విషయంలో✽, పండుగలూ✽ అమావాస్యలూ విశ్రాంతి రోజులూ అనేవాటి విషయంలో ఎవ్వరూ✽ మీకు తీర్పు తీర్చకుండా చూచుకోండి. 17 అలాంటివి రాబోయేవాటికి నీడలు✽ మాత్రమే. వాటి స్వరూపం✽ క్రీస్తు సంబంధమైనది. 18 ✽కపట వినయంలో, దేవదూతలను పూజించడంలో ఇష్టమున్నవాడెవ్వడూ మీ బహుమతి✽కి అడ్డుపడనివ్వండి. అలాంటివాడు తాను చూడని వాటిలోకి✽ చొచ్చుకొనిపోతారు. వాడి భ్రష్ట మనసు✽ వాణ్ణి ఊరికే ఉబ్బిస్తుంది✽. 19 వాడు శిరస్సు✽ను హత్తుకోకుండా ఉన్నాడు. ఆయన వల్ల శరీరమంతా పోషణ పొందుతూ, దాని కీళ్ళచేత, నరాలచేత ఏకమై ఉండి, దేవుడు కలిగించిన వృద్ధివల్ల పెరుగుతూ✽ ఉంది.
20 కాబట్టి ఈ లోకానికి చెందిన ప్రాథమిక నియమాల✽ విషయంలో మీరు క్రీస్తుతో కూడా చనిపోయారూ✽ అంటే లోకంలో బ్రతుకుతూ ఉన్నట్టు ఈ నిర్ణయాలకు లొంగిపోవడ మెందుకు? 21 ✽“అది పట్టుకోకూడదు! ఇది రుచిచూడకూడదు! దానిని తాకకూడదు!” అనే నిర్ణయాలకు లొంగిపోవడ మెందుకు? 22 ఈ నిర్ణయాలన్నీ వాడుకోవడంలోనే నశించిపోయేవాటిని గురించినవే. మనుషుల ఆజ్ఞల మీదా ఉపదేశాల మీదా ఆధారపడేవే. 23 ఇష్టారాధన✽తో, కపట వినయంతో, కఠిన తపస్సు✽తో ఉన్న ఆ విషయాలలో జ్ఞానం ఉన్నట్టే✽ అనిపిస్తుంది గాని శరీర స్వభావానికి చెందిన కోరికలను తీర్చుకోకుండా అవి దేనికీ పనికిరావు.