5
1 ✽ అందుచేత దేవుని ప్రియమైన పిల్లలు✽గా తగినట్టు ఆయనను అనుసరించి నడుచుకొంటూ ఉండండి. 2 క్రీస్తు మనలను ప్రేమించి✽ మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, బలిగా✽ తనను అప్పగించుకొన్నాడు. అలాగే మీరూ ప్రేమభావం✽తో ప్రవర్తిస్తూ ఉండండి. 3 ✝కానీ పవిత్రులకు తగినట్టుగా నడుస్తూ వ్యభిచారం, కల్మషమంతా, అత్యాశ✽ - వీటిని సూచించే మాటలు సహా మీ మధ్య ఎవరూ ఎత్తకూడదు. 4 ✝అంతేగాక, బూతులు, పనికిమాలిన మాటలు, సరససల్లాపాలు మీరు పలకకూడదు. అలాంటివి తగవు. వాటికి బదులు కృతజ్ఞతలు✽ చెపుతూ ఉండాలి.5 ✝ఈ విషయం మీకు బాగా తెలుసు – ఏ వ్యభిచారి గానీ కల్మషుడు గానీ అత్యాశపరుడు (అతడు విగ్రహ పూజకుడు✽) గానీ దేవునికీ క్రీస్తుకూ చెందిన రాజ్యం✽లో ఏ వారసత్వం కలిగి ఉండడు. 6 వట్టి మాటలతో ఎవరూ మిమ్ములను మోసగించనియ్యకండి✽. అలాంటి అపరాధాల కారణంగా దేవుని కోపం అవిధేయులమీదికి వస్తుంది. 7 ✝గనుక అలాంటివారితో పాలివారు కాకండి.
8 ✽మునుపు మీరు చీకటి, ఇప్పుడైతే ప్రభువులో మీరు వెలుగు. 9 దేవుని ఆత్మ ఫలం✽ అన్ని రకాల మంచితనం✽, నీతినిజాయితీ✽లు, సత్యం✽. 10 ✽ ప్రభువుకు ఏవి ఆనందకరమైనవో అవి కనుగొని వెలుగు సంతానానికి తగినట్టు నడుచుకొంటూ ఉండండి. 11 వ్యర్థమైన చీకటి వ్యవహారాలలో✽ పాల్గొనకండి. దానికి బదులు వాటిని ఖండించండి. 12 ✽ వారు గుట్టుగా చేసే పనులను గురించి మాట్లాడడం కూడా సిగ్గుచేటు. 13 వెలుగువల్ల వెల్లడి అయినవన్నీ గోచరమవుతాయి, గోచరమయ్యేలా చేసేది వెలుగే. 14 ✽అందుచేత ఆయన “నిద్రబోతూ! మేల్కో! మృతి చెందిన✽వారిలోనుంచి లే! క్రీస్తు నీమీద ప్రకాశిస్తాడు” అంటాడు.
15 ✽ఈ రోజులు చెడ్డవి✽, గనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ ఉండండి. 16 తెలివితక్కువ వారిలాగా కాక, తెలివైనవారిలాగే✽ నడుచుకోవడానికి✽ శ్రద్ధ వహిస్తూ ఉండండి. 17 బుద్ధిహీనులు కాకండి! ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి✽.
18 మద్యంతో మత్తిల్లకండి✽. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే దేవుని ఆత్మ✽తో నిండి ఉండండి. 19 ✽✽అలాగే కీర్తనలు, భజనలు, ఆధ్యాత్మిక సంగీతాలు వినిపిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడండి. పాడుతూ మీ హృదయాలలో ప్రభువుకు గానం చేయండి. 20 ✽మన ప్రభువైన యేసు క్రీస్తు పేర తండ్రి అయిన దేవునికి అన్నిటి కోసం ఎప్పుడూ కృతజ్ఞతలు చెపుతూ ఉండండి. 21 దేవుడంటే భయభక్తులు✽ కలిగి ఒకరికొకరు లోబడి✽ ఉండండి.
22 పెళ్ళి అయిన స్త్రీలారా, ప్రభువుకు మీరు లోబడినట్టే✽ మీ భర్తలకు లోబడి ఉండండి. 23 క్రీస్తు సంఘానికి శిరస్సు, శరీరానికి✽ రక్షకుడు✽. అలాగే భర్త భార్యకు శిరస్సు.✽ 24 గనుక తన సంఘం క్రీస్తుకు లోబడినట్టు భార్యలు తమ భర్తలకు అన్ని విషయాలలో✽ లోబడివుండాలి.
25 పెండ్లి అయిన పురుషులారా, తన సంఘాన్ని క్రీస్తు ప్రేమించినట్టే✽ మీ భార్యలను ప్రేమిస్తూ✽ ఉండండి. 26 ✽దేవుని వాక్కు అనే నీళ్ళతో✽ స్నానం ద్వారా దాన్ని శుద్ధి చేసి పవిత్రపరచేందుకు క్రీస్తు దానికోసం తనను అర్పించుకొన్నాడు✽. 27 సంఘం పవిత్రంగా, నిర్దోషంగా ఉండాలనీ మచ్చ, మడత, అలాంటి మరేదీ లేకుండా దివ్యమైనదిగా దానిని తనముందు నిలబెట్టుకోవాలనీ ఆయన అలా చేశాడు. 28 ✽అలాగే భర్తలు కూడా తమ సొంత శరీరాలనులాగే తమ భార్యలను ప్రేమించాలి. తన భార్యను ప్రేమిస్తున్నవాడు తనను ప్రేమించుకొంటున్నాడన్నమాట. 29 సొంత శరీరాన్ని ద్వేషించుకొనేవాడెవడూ లేడు. ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొంటాడు✽. ప్రభువు తన సంఘాన్ని అలాగే చూచుకొంటాడు. 30 ✝ఎందుకంటే మనం ఆయన మాంసం, ఎముకలలో ఆయన శరీరంలోని భాగాలం.
31 ✝“అందుచేత మనిషి తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకొంటాడు. వారిద్దరూ ఒకే శరీరమవుతారు.” 32 ✽ఈ రహస్య సత్యం గొప్పది. అయితే నేను క్రీస్తునూ సంఘాన్నీ ఉద్దేశించి మాట్లాడుతున్నాను. 33 ✽అయినా మీలో ప్రతివాడూ తనలాగే తన భార్యను ప్రేమించాలి. భార్య భర్తను గౌరవించాలి.