4
1 ✽ఇందువల్ల మేము ఈ సేవ కలిగి ఉండి దేవుని కరుణ పొందినందుకు నిరుత్సాహపడం. 2 ✽ అయితే కుయుక్తిగా ప్రవర్తించకుండా, దేవుని వాక్కును కల్తీ చేయకుండా అవమానకరమైన రహస్య విషయాలు నిరాకరించాం. సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉండడంవల్ల, దేవుని సముఖంలో ప్రతి మనిషి అంతర్వాణికీ మా యోగ్యతలు కనపరుస్తున్నాం.3 ✽ ఒక వేళ మా శుభవార్త మరుగై ఉందీ అంటే, అది నశిస్తున్నవారికే మరుగై ఉంది. 4 ✽విశ్వాసం లేని వారి మనసులకు వారి విషయంలో ఈ యుగ దేవుడు గుడ్డితనం కలిగించాడు✽. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ✽ను గురించిన శుభవార్త వెలుగు వారి మీద ప్రకాశించకుండా అలా చేశాడు. 5 ✽కాబట్టి మేము మమ్ములను ప్రకటించుకోకుండా, ప్రభువైన క్రీస్తు యేసునూ మమ్మల్ని యేసుకోసం మీ దాసులుగానూ ప్రకటిస్తున్నాం. 6 ✽క్రీస్తు ముఖంలో✽ ఉన్న దేవుని మహిమను గురించిన జ్ఞాన కాంతి మనకు ప్రసాదించడానికి, చీకటిలో నుంచి వెలుగును ప్రకాశించమని ఆజ్ఞాపించిన దేవుడు మన హృదయాలలో ప్రకాశించాడు.
7 అయితే అత్యధిక బలప్రభావం మావల్ల కాక దేవుని వల్ల అయి ఉండేలా ఈ ఐశ్వర్యం✽ మాకు మట్టి పాత్రలలో✽ ఉంది. 8 ✽అన్ని వైపులా ఒత్తిడి మామీదికి వస్తూ ఉంది గాని మేము ఇరుక్కొనిపోవడం లేదు. ఆందోళన పడుతున్నాం గాని నిరాశ చెందడం లేదు. 9 హింసలకు గురి అవుతూ ఉన్నాం గాని విడిచిపెట్టబడ్డవారం కాము. మమ్ములను పడద్రోయడం జరుగుతూ ఉంది గాని మేము నాశనం కావడం లేదు. 10 యేసు జీవం మా శరీరంలో వెల్లడి కావాలని యేసు మరణం✽ కూడా మా శరీరంలో ఎప్పుడూ భరిస్తూ ఉన్నాం. 11 ఎలాగంటే, చావుకు లోనయ్యే మా శరీరాలలో యేసు జీవం వెల్లడి అయ్యేలా సజీవులమైన మమ్ములను యేసుకోసం మరణానికి అప్పగించడం ఎప్పుడూ జరుగుతూ ఉంది. 12 అందుచేత మాలో మరణం, మీలో జీవం పని చేస్తూ ఉన్నాయి.
13 ✽ “నేను నమ్ముకొన్నాను గనుక మాట్లాడాను” అని రాసి ఉంది. అలాంటి విశ్వాసం గల మనసు కలిగి మేము కూడా నమ్ముతున్నాం గనుక మాట్లాడుతున్నాం. 14 ప్రభువైన యేసును సజీవంగా లేపినవాడు యేసుతో మమ్ములను కూడా సజీవంగా లేపి మీతోపాటు తన ముందు నిలబెట్టుకొంటాడని మాకు తెలుసు. 15 ✽అనేకులకు వ్యాపించిన దేవుని కృప, ఆయన మహిమకు కృతజ్ఞతలు సమృద్ధిగా కలిగించేలా అంతా మీ కోసమే ఉంది.
16 ✽అందుచేత మేము నిరుత్సాహం చెందము✽. శారీరకంగా క్షీణించిపోతూ✽ ఉన్నా ఆంతర్యంలో మాకు రోజు రోజుకూ కొత్తదనం✽ కలుగుతూ ఉంది. 17 మేము కనిపించేవాటిమీద దృష్టి ఉంచకుండా కనిపించనివాటిమీదే దృష్టి ఉంచు కొంటున్నాం 18 గనుక క్షణికమైన✽, చులకనైన మా బాధ✽ దానికి ఎంతో మించిపోయే శాశ్వత మహిమభారాన్ని మా కోసం కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కనిపిస్తున్నవి కొంత కాలమే ఉంటాయి గాని కనిపించనివి శాశ్వతమైనవి.