6
1 ✽యెహోవా చెప్పినది వినండి: “మీరు నిలబడి పర్వతాలను సాక్ష్యం పెట్టి వాదించండి. కొండలకు మీ మాటలు వినబడనివ్వండి. 2 పర్వతాల్లారా! యెహోవా చేసిన ఫిర్యాదు వినండి. భూమి నిశ్చలమైన పునాదులారా, ఆలకించండి! యెహోవాకు తన ప్రజ విషయం ఫిర్యాదు ఉంది. ఆయన ఇస్రాయేల్ ప్రజతో వాదిస్తాడు.3 “నా ప్రజలారా✽! నేను మీకేమి కీడు చేశాను? మిమ్ములను ఎలా ఆయాసపరచాను?✽ అది నాతో చెప్పండి. 4 ✝నేను మిమ్ములను ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చాను. మిమ్ములను దాస్యంలో ఉంచిన ఆ దేశంనుంచి విడిపించాను. మీకు దారి చూపడానికి మోషేనూ✽ అహరోనునూ మిర్యామునూ✽ పంపించాను. 5 నా ప్రజలారా! మోయాబు రాజైన బాలాకు ఆలోచన చేసిన సంగతి, బెయోరు కొడుకైన బిలాం✽ అతడికి చెప్పిన జవాబు జ్ఞాపకం చేసుకోండి. యెహోవా న్యాయమైన క్రియలు✽ మీరు గ్రహించుకొనేలా షిత్తీం నుంచి గిల్‌గాల్ వరకు✽ జరిగినవి మనసుకు తెచ్చుకోండి.”
6 ✽దేనిని తీసుకొని నేను యెహోవా సన్నిధానంలోకి రావాలి? దేనిని తీసుకొని సర్వాతీతుడైన దేవుని ఎదుట వంగి ఆరాధించాలి? హోమాలనూ ఏడాది దూడలనూ ఆయన సన్నిధానంలోకి తీసుకురావాలా? 7 వేలకొలది పొట్టేళ్ళూ పదివేల తైల నదులూ అర్పించడం యెహోవాకు సంతోషం కనిగిస్తుందా? నాకు మొదట పుట్టిన కొడుకును నా అతిక్రమంకోసం అర్పించాలా? నా పాప పరిహారం కోసం నా సంతానాన్ని అర్పించాలా? 8 ✽మనిషీ! ఏది మంచిదో అది యెహోవా నీకు తెలియజేశాడు✽. ఆయన నిన్ను కోరేదేమంటే, న్యాయంగా ప్రవర్తించడం, కరుణను ప్రేమించడం, వినయం కలిగి నీ దేవునితో కలిసి నడవడం.
9 ✽వినండి! యెహోవా స్వరమెత్తి జెరుసలం నగరానికి✽ ఇలా చెపుతున్నాడు (నీ పేరంటే భయభక్తులున్న వాడే జ్ఞాని✽): “శిక్షను గురించిన సందేశం, శిక్ష✽ను నిర్ణయించినవాని మాటలు వినండి! 10 దుర్మార్గుల ఇండ్లలో దుర్మార్గంగా✽ సంపాదించుకొన్న సొత్తులున్నాయి గదా. కొలతకు చిన్నదిగా చేసిన గంప ఉంది గదా. అది అసహ్యకరం. 11 ✝తప్పు త్రాసు, తప్పు రాళ్ళున్న సంచి ఉంచుకొన్నవాణ్ణి నిర్దోషి అని నేను తీర్పు చెప్తానా? 12 నగరంలో ఉన్న ధనవంతులు దౌర్జన్యం✽ చేస్తూనే ఉంటారు. అక్కడి ప్రజలు అబద్ధికులు. వాళ్ళ నాలుకలు కపటంగా✽ మాట్లాడుతాయి. 13 అందుచేత✽, మీ అపరాధాల కారణంగా నేను మిమ్ములను బాధిస్తాను, హతమారుస్తాను, నాశనం చేస్తాను. 14 ✝మీరు భోజనం చేసినా తృప్తిపడరు. మీ కడుపులు ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు కూడబెట్టుకొన్నది మీకు ఉండదు. మీరు భద్రం చేసుకొన్నది దోపిడీ అయ్యేలా నేను చేస్తాను. 15 ✝మీరు విత్తనాలు వేస్తారు గాని కోత కోయరు. ఆలీవ్‌చెట్ల పండ్లను త్రొక్కుతారు గాని ఆ నూనె పూసుకోరు, ద్రాక్షపండ్లను త్రొక్కుతారు గాని ఆ రసం త్రాగరు. 16 ఎందుకంటే, ఒమ్రీ నియమించిన చట్టాలు మీరు పాటిస్తున్నారు. అహాబు✽ వంశంవాళ్ళు ప్రవర్తించినట్టే మీరూ ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ పద్ధతులను అనుసరిస్తున్నారు. అందుచేత నేను మిమ్ములను నాశనానికి అప్పగిస్తాను, దాని నివాసులను పరిహాసానికి✽ గురి చేస్తాను. నా ప్రజలకు రావలసిన అవమానం మీరు పొందుతారు.”