12
1 ✽ఎఫ్రాయిం గాలి మేసే జనం. తూర్పు గాలిని తరుముతూ ఉంటారు, మానక రోజంతా అబద్ధాలాడుతూ, దౌర్జన్యం చేస్తూ ఉంటారు. అష్షూరువారితో సంధి చేస్తారు. ఈజిప్ట్‌కు నూనె పంపివేస్తారు. 2 యూదా✽వారిమీద కూడా యెహోవా నేరారోపణ చేయవలసివచ్చింది. యాకోబు✽ ప్రజలను వారి ప్రవర్తనను బట్టి శిక్షిస్తాడు. వారి పనులకు తగినట్టుగా వారికి ప్రతీకారం చేస్తాడు. 3 ✝తల్లి గర్భంలో యాకోబు తన తోబుట్టినవాడి కాలి మడమను పట్టుకొన్నాడు. పెరిగి పెద్దవాడయ్యాక అతడు దేవునితో పోరాడాడు. 4 అతడు దేవదూత✽తో పోరాడి గెలిచాడు. అతడు కన్నీళ్ళు విడుస్తూ దయ చూపమని ఆ దూతను ప్రాధేయపడ్డాడు. బేతేల్✽లో అతడు ఆయనకు దొరికాడు. అక్కడ ఆయన అతడితో మాట్లాడాడు – 5 ఆయన ప్రఖ్యాతి గల పేరు యెహోవా✽, సేనల దేవుడు యెహోవా. 6 ✽అందుచేత మీరు మీ దేవునివైపుకు తిరగండి. దయగా న్యాయంగా✽ ప్రవర్తిస్తూ ఉండండి. ఎడతెరపి లేకుండా మీ దేవునికోసం నమ్మకంతో ఎదురు చూస్తూ✽ ఉండండి.7 ✽ఎఫ్రాయింవారు కనానుజాతి వర్తకుడిలాంటివారు. వారి త్రాసు మోసకరం. వంచించడానికి వారు ఇష్టపడుతారు. 8 ఎఫ్రాయింవారు “మేము ధనవంతులం, మాకు చాలా ఆస్తిపాస్తులు✽ లభించాయి. అయితే మా కష్టార్జితమంతా చూచి శిక్షకు తగిన అపరాధం✽ మాలో ఉన్నట్టు ఎవ్వరూ చూపించలేరు” అని చెప్పుకొంటారు.
9 “నేను యెహోవాను, మీరు ఈజిప్ట్✽ విడిచి వచ్చినప్పటినుంచి మీ దేవుణ్ణి. నియామకమైన పండుగ రోజులలాగే మిమ్ములను మళ్ళీ డేరాలలో✽ నివసించేలా చేస్తాను. 10 నేను ప్రవక్తలతో మాట్లాడాను✽. వారికి అనేక దర్శనాలు✽ ప్రసాదించాను. వారిద్వారా✽ ఉదాహరణలు✽ ఇచ్చాను.”
11 గిలాదు✽వారు చెడ్డవారు కారా? అక్కడి నివాసులు వ్యర్థులు! గిల్గాల్✽లో ప్రజలు ఎడ్లను బలులుగా అర్పిస్తారు. వారి బలిపీఠాలు సాగు చేసిన పొలంలో ఉన్న రాళ్ళ కుప్పలలాగా అవుతాయి.
12 ✽ యాకోబు సిరియాదేశానికి పారిపోయాడు. భార్య కావాలని ఇస్రాయేల్ సేవ చేశాడు. భార్య కావాలని గొర్రెలు కాచాడు. 13 యెహోవా ఇస్రాయేల్ ప్రజలను ఈజిప్ట్ నుంచి గొర్రెలు తీసుకురావడానికి ఒక ప్రవక్తను వినియోగించు కొన్నాడు. వారిని కాపాడడానికి కూడా ఒక ప్రవక్త✽ను ఉపయోగించుకొన్నాడు. 14 ✽ఎఫ్రాయింవారు ఘోరమైన కోపానికి కారకులు. వారు రక్తపాతం✽ చేశారు. ప్రభువు వారిమీద ఆ అపరాధం నిలిచి ఉండనిస్తాడు. వారు చేసిన తిరస్కారానికి ప్రతీకారం చేస్తాడు.