3
1 యెహోవా నాతో ఇలా అన్నాడు: “ఇస్రాయేల్ ప్రజ ఇతర దేవుళ్ళవైపుకు తిరిగి, ద్రాక్షపండ్ల అడలను అర్పించాలని ఆశిస్తారు. అయినా యెహోవా ఈ ప్రజను ప్రేమతో చూస్తున్నాడు. అలాగే నీవు వెళ్ళి వేరొకడికి ప్రియురాలై వ్యభిచారం చేస్తున్న ఆమెను ప్రేమతో చూడు.”
2 అందుచేత నేను పదిహేను వెండి నాణేలు, పది బుట్టల యవలు ఇచ్చి ఆమెను కొనుక్కొన్నాను. 3 అప్పుడు ఆమెతో “చాలాకాలం నువ్వు నాకోసం ఉండిపోవాలి. నువ్వు వేశ్యలాగా ప్రవర్తించకూడదు. ఏ పురుషుడితో పోకూడదు. అలాగే నీపట్ల నేను వ్యవహరిస్తాను” అన్నాను.
4 ఎందుకంటే, ఇస్రాయేల్ ప్రజ చాలా కాలం రాజూ పరిపాలకుడూ లేకుండా, బలులు అర్పించకుండా ఉండిపోతారు. ఆ కాలంలో వారికి దేవతాస్తంభాలు, ఏఫోదు, గృహదేవతలు ఉండవు. 5 తరువాత ఇస్రాయేల్ ప్రజ తిరిగి వచ్చి వారి దేవుడైన యెహోవానూ, వారి రాజైన దావీదునూ వెదకుతారు. చివరి రోజుల్లో యెహోవా దీవెనలు పొందడానికి వారు వణకుతూ ఆయనదగ్గరికి వస్తారు.