9
1 ✽ మాదీయుడైన అహష్‌వేరోషు కొడుకు దర్యావేషు కల్దీయవాళ్ళ మీద రాజయ్యాడు. 2 ✽అతడు పరిపాలించిన మొదటి సంవత్సరంలో నేను – దానియేలును – లేఖనాలవల్ల గ్రహించిన విషయం ఏమంటే, యిర్మీయాప్రవక్తకు యెహోవానుంచి వచ్చిన వాక్కు ప్రకారం జెరుసలం పాడుగా ఉండవలసినది డెబ్భై సంవత్సరాలు. 3 ✽అప్పుడు నేను మనసారా ప్రభువైన దేవునివైపు తిరిగి, ప్రార్థన, విన్నపాలు చేశాను, ఉపవాసము✽న్నాను, గోనెపట్ట కట్టుకొని ధూళి✽ తలపై పోసుకొన్నాను. 4 నా దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తూ ఇలా ఒప్పుకొన్నాను:“ప్రభూ! మహాత్యంగల దేవా! భయభక్తులకు పాత్రుడవైన దేవా! నిన్ను ప్రేమిస్తూ నీ ఆజ్ఞలను పాటించే వారిపట్ల నీవు అనుగ్రహం చూపుతావు, నీ ఒడంబడికను✽ స్థిరపరుస్తావు. 5 మేమైతే✽ పాపాలు చేశాం✽, అక్రమాలు చేశాం, దుర్మార్గంగా ప్రవర్తించాం, తిరుగుబాట్లు చేశాం. నీ ఆజ్ఞలనూ న్యాయనిర్ణయాలనూ విడిచిపెట్టాం. 6 ✝నీ దాసులైన ప్రవక్తలు నీ పేర మా రాజులకూ అధిపతులకూ పూర్వీకులకూ యూదా దేశంవారందరికీ చెప్పిన మాటలు పెడచెవిని పెట్టాం.
7 “ప్రభూ! న్యాయం✽ నీకే చెందుతుంది, మాకు తలవంపులే✽. మేము నీపట్ల ద్రోహం✽ చేసినందుచేత నీవు ఆయా దేశాలకు మమ్ములను చెదరగొట్టావు. జెరుసలం నివాసులకూ యూదా ప్రదేశస్థులకూ ఇస్రాయేల్‌ప్రజలందరికీ – దూర దేశాలకూ సమీప దేశాలకూ చెదరి ఉన్న మాకందరికీ ఈ రోజు తలవంపులే చెందుతాయి. 8 ప్రభూ! మేము నీకు వ్యతిరేకంగా పాపాలు చేసినందుకే మాకూ మా రాజులకూ అధిపతులకూ పూర్వీకులకూ తలవంపులు కలిగాయి. 9 ✝కరుణ, క్షమాపణ చూపడం మా ప్రభువైన దేవునికి చెందుతుంది. మేము ఆయనకు వ్యతిరేకంగా తిరగబడ్డాం. 10 ✝మా దేవుడైన యెహోవా మాట పెడచెవిని పెట్టాం. ఆయన తన దాసులైన ప్రవక్తలద్వారా మాకు ఇచ్చిన ఆజ్ఞలు శిరసావహించలేదు. 11 ఇస్రాయేల్‌ప్రజలంతా నీ ధర్మశాస్త్రాన్ని మీరారు. నీ మాట వినకుండా నిన్ను విడిచిపెట్టారు. ఇలాగు నీకు వ్యతిరేకంగా పాపాలు చేశాం. గనుకనే నీ దాసుడైన మోషే ధర్మశాస్త్రగ్రంథంలో నీవు ప్రమాణం చేసిన తీర్పూ శాపమూ మామీదికి ముంచుకువచ్చి పడ్డాయి. 12 ✝జెరుసలంలో జరిగినట్టు ఆకాశమంతటిక్రింద మరే స్థలంలోనూ ఎప్పుడూ జరగలేదు. నీవు మామీదికి మా పరిపాలకులమీదికీ ఇంత గొప్ప విపత్తు రప్పించి మాకు వ్యతిరేకంగా నీవు చెప్పిన మాటలు నెరవేర్చావు. 13 మోషే ధర్మశాస్త్రగ్రంథంలో వ్రాసి ఉన్నట్టే ఈ విపత్తంతా మామీదికి వచ్చింది. అయినా మేము మా పాపాలను వదలివేయలేదు, నీ సత్యం అనుసరించడం మొదలుపెట్టలేదు. అలా చేసి మా దేవుడైన యెహోవా అనుగ్రహం కావాలని ప్రాధేయపడలేదు✽. 14 ✽ మా దేవుడైన యెహోవా చేసే క్రియలన్నిటిలోనూ న్యాయవంతుడు గనుక అదను కనిపెట్టి ఆయన ఈ విపత్తు మామీదికి రప్పించాడు. అయినా మేము ఆయన మాట పెడచెవిని పెట్టాం.
15 ✝“ప్రభూ! మా దేవా! నీ భుజ బలంచేత నీ ప్రజను ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చి, తద్వారా ఇప్పటివరకు నిలిచివుండే పేరు✽ప్రతిష్ఠలు సంపాదించుకొన్న దేవా! మేము పాపాలు చేశాం, దుర్మార్గంగా ప్రవర్తించాం. 16 ✽జెరుసలం, నీ ప్రజ మా చుట్టున్న జనులందరి తిరస్కారానికి గురి కావడానికి కారణం మా పాపాలే, మా పూర్వీకుల దోషాలే. ప్రభూ, జెరుసలం నీ నగరం, నీ పవిత్రమైన కొండ. దాని మీదనుంచి నీ కోపం, నీ ఆగ్రహం తొలగించమని న్యాయసమ్మతమైన నీ క్రియలనుబట్టి విన్నవించుకొంటున్నాను. 17 మా దేవా! ఇప్పుడు నీ దాసుడైన నా ప్రార్థనలూ విన్నపాలూ ఆలకించు. ప్రభూ! పాడైపోయిన నీ పవిత్రాలయంమీద నీ ముఖకాంతి నీ ఘనత✽ కోసం ప్రసరించనియ్యి. 18 దేవా! చెవి ఒగ్గి ఆలకించు. నీ కండ్లు తెరచి నాశనమైన మా పరిస్థితులనూ నీ పేరు పెట్టబడ్డ నగరాన్నీ చూడు. మేము న్యాయవంతులమని నీ సన్నిధానంలో ప్రార్థన చేయడం లేదు✽ గాని నీవు కరుణామయుడివని నిన్ను ప్రార్థిస్తున్నాం. 19 ప్రభూ! ఆలకించు! ప్రభూ! క్షమించు! ప్రభూ! చెవి ఒగ్గి పని చెయ్యి! నా దేవా! నీ ఘనత కోసం ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే నీ పేరు నీ పట్టణానికీ నీ ప్రజకూ పెట్టి ఉంది.”
20 నేను మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ, నా పాపాలూ నా ప్రజలైన ఇస్రాయేల్‌వారి పాపాలూ ఒప్పుకొంటూ, నా దేవుని పవిత్రమైన కొండ✽ విషయం నా దేవుడైన యెహోవా సన్నిధానంలో విన్నపం చేస్తూ వచ్చాను. 21 నేను ఇంకా మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ✽ ఉండగానే గబ్రియేల్✽ త్వరగా ఎగిరివచ్చి సాయంకాలం బలి✽ అర్పించే వేళ నాదగ్గర చేరాడు. గబ్రియేల్ ముందటి దర్శనంలో నాకు కనిపించిన వ్యక్తి. 22 ✝అతడు నాతో మాట్లాడుతూ నాకు ఇలా ఉపదేశం ఇచ్చాడు: “దానియేలూ! గ్రహించడానికి తెలివితేటలు నీకు ఇవ్వడానికి వచ్చాను. 23 ✽ నీవు దేవునికి ఎంతో ప్రియమైనవాడివి గనుక నీవు ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడే దేవునినుంచి వాక్కు వచ్చింది. ఆ వాక్కు నీకు తెలియజేయడానికి నేను వచ్చాను. కనుక ఈ వాక్కు తెలుసుకొని నీకు కలిగిన దర్శనం అర్థం చేసుకో.
24 ✽ ✽“తిరుగుబాటు మాన్పించడానికీ, పాపాన్ని తుదముట్టించడానికీ, పాపపరిహారం చేయడానికీ, శాశ్వత న్యాయాన్ని ప్రవేశపెట్టడానికీ, దర్శనాన్ని, భవిష్యద్వాక్కులను ముద్ర వేయడానికీ, అతి పవిత్ర స్థలాన్ని నూనె పోసి ప్రతిష్ఠ చేయడానికీ నీ ప్రజకు నీ పవిత్ర నగరానికి డెబ్భై ‘ఏడు’లు నిర్ణయించడం జరిగింది.
25 ✽“ఈ సంగతి తెలుసుకొని గ్రహించు: జెరుసలం మళ్ళీ కట్టి పూర్వస్థితికి తేవాలని ఆజ్ఞ జారీ చేయడం జరిగే సమయంనుంచి అభిషిక్తుడైన అధిపతి సమయంవరకు ఏడు ‘ఏడులు’ అరవై రెండు ‘ఏడులు’ పడుతుంది. కష్టకాలంలో జెరుసలం దాని నడివీధులతోను కందకంతోను కూడా మళ్ళీ కట్టబడుతుంది. 26 ఈ అరవై రెండు ‘ఏడుల’ తరువాత అభిషిక్తుడు హతం✽ అవుతాడు. అప్పటికి ఆయన స్వాధీనంలో ఏమీ ఉండదు✽. ఆ తరువాత వచ్చే పరిపాలకుడి✽ యొక్క ప్రజలు నగరాన్నీ పవిత్రస్థానాన్నీ నాశనం✽ చేస్తారు. అంతం వరదలాగా వస్తుంది. అంతంవరకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. నాశనం సంభవించాలని నిర్ణయం అయింది. 27 అతడు✽ ఒక ‘ఏడు’ వరకు చాలామందికి ఒక ఒడంబడిక స్థిరపరుస్తాడు. అయితే ఆ ‘ఏడు’లో సగం గడిచిన తరువాత బలినీ నైవేద్యాన్నీ నిలిపివేస్తాడు. నాశనాల రెక్కలతో వినాశకారుడు వస్తాడు. నిర్ణయం అయిన నాశనం అతడిమీద కుమ్మరించడం జరిగేవరకు, అంతంవరకు అలాగు ఉంటుంది.”