యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే,
‘అయ్యయ్యో, దుర్దినం దగ్గరపడింది!’
అని పెడ బొబ్బలు పెట్టండి.
3 ✽నిజంగా ఆ దినం దగ్గరపడింది.
యెహోవా దినం సమీపమయింది.
అది దట్టమైన మేఘాల రోజు,
జనాలు శిక్షకు గురి అయ్యే రోజు.
4 అప్పుడు ఖడ్గం ఈజిప్ట్‌మీద పడుతుంది.
ఈజిప్ట్‌లో జనం హతమై కూలుతూ ఉంటే,
కూషుదేశస్థులు వేదనల పాలవుతారు.
ఈజిప్ట్‌వాళ్ళ ధనాన్ని పట్టుకుపోవడమూ,
ఆ దేశం పునాదులు నాశనం కావడమూ జరుగుతుంది.
5 వాళ్ళతోపాటు కూషు, పూత్, లూదీయ అనే దేశాలు, అరేబియ అంతా, కూబుదేశం, ఒడంబడిక దేశప్రజలు✽ కూడా ఖడ్గానికి గురి కావడం తప్పదు.
6 “యెహోవా ఇలా అంటున్నాడు:
ఈజిప్ట్‌కు అండగా ఉన్నవాళ్ళు కూలుతారు.
గర్వంతో కూడిన దాని బలం అణగిపోతుంది.
మిగ్‌దోల్ నుంచి సెవేనేవరకు జనం
కత్తిపాలై కూలుతారు.
ఇది యెహోవాప్రభు వాక్కు.
7 ఆ దేశం పాడైపోయిన దేశాలలో
ఒకటి అవుతుంది.
నాశనమైపోయిన పట్టణాలలో దాని పట్టణాలు
నశించిన స్థితిలో ఉంటాయి.
8 నేను ఈజిప్ట్‌లో మంట రాజేసేటప్పుడు,
దాని సహాయులంతా హతమయ్యేటప్పుడు
నేనే యెహోవానని వాళ్ళు తెలుసు కొంటారు.
9 ఆ రోజున నా సముఖంనుంచి వార్తాహరులు ఓడలో బయలుదేరి అశ్రద్ధగా ఉన్న కూషుదేశస్థులను భయకంపితులను చేస్తారు. ఈజిప్ట్‌కు విపత్తు వచ్చే రోజున వాళ్ళు వేదనల పాలవుతారు. ఆ రోజు త్వరలోనే వస్తుంది.
10 “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు:
బబులోను రాజైన నెబుకద్‌నెజరుచేత
ఈజిప్ట్‌యొక్క అల్లరిమూకలు
అంతమయ్యేలా చేయిస్తాను.
11 దేశాన్ని నాశనం చేయడానికి అతడు,
అతడి సైన్యం వస్తారు.
ఆ జనం జనాలన్నిట్లో అతి భయంకరమైన✽ జనం.
వాళ్ళు ఈజిప్ట్‌కు శత్రువులై ఖడ్గాలను దూసి
హతమైనవాళ్ళతో దేశాన్ని నింపుతారు.
12 నేను స్వయంగా నైలు కాలువలను
ఇంకిపోయేలా చేస్తాను,
ఆ దేశాన్ని దుర్మార్గులకు అమ్మివేయిస్తాను,
విదేశీయులచేత దేశాన్నీ దానిలో ఉన్నదంతా
పాడు చేయిస్తాను.
నేను – యెహోవాను – ఈ మాట ఇచ్చాను.
13 “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు:
నోఫ్✽కు చెందే విగ్రహాలను✽ నిర్మూలిస్తాను,
ప్రతిమలు లేకుండా చేస్తాను.
అప్పటినుంచి ఈజిప్ట్‌లో రాజు ఉండడు.
దేశమంతటా నేను భయం పుట్టిస్తాను.
14 పత్రోసును పాడు చేస్తాను,
సోయనులో మంట రాజేలా చేస్తాను.
నో పట్ల నా తీర్పులప్రకారం జరిగిస్తాను.
15 ఈజిప్ట్‌కు కోటగా ఉన్న సీన్‌మీద
నా కోపాగ్ని కుమ్మరిస్తాను,
నోలో జనసమూహాన్ని హతమారుస్తాను.
16 ఈజిప్ట్‌ను తగులబెడతాను. సీన్‌పట్టణస్థులు
వేదనతో అల్లాడిపోతారు.
నో బ్రద్దలు అవుతుంది. రోజురోజు నోఫ్
బాధలకు గురి అవుతుంది.
17 ఓను, పిబేసేతుల యువకులు కత్తిపాలవుతారు.
ఆ పట్టణస్థులు బందీలుగా పోతారు.
18 ఈజిప్ట్ మోపిన కాడిని నేను తహపనేసులో
విరిచే రోజున చీకటి కమ్ముకొంటుంది.
ఈజిప్ట్ బల గర్వం అక్కడ అంతమవుతుంది.
దాన్ని మబ్బులు కమ్ముకొంటాయి.
దాని కూతుళ్ళు బందీలుగా పోతారు.
19 ఈ విధంగా నా తీర్పుల ప్రకారం ఈజిప్ట్‌పట్ల
జరిగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని
వారు తెలుసుకొంటారు.”
20 పదకొండో సంవత్సరం మొదటి నెల ఏడో రోజున యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 21 “మానవపుత్రా, ఈజిప్ట్ రాజైన ఫరో హస్తాన్ని✽ నేను విరగగొట్టాను. అది బాగుపడేలా దానికి కట్టు కట్టడం జరగలేదు. ఖడ్గం పట్టుకొనే బలం దానికి వచ్చేలా బద్దకట్టడం జరగలేదు. 22 ✽ఇందుకు యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: ఈజిప్ట్ రాజైన ఫరోకు నేను వ్యతిరేకిని. అతడి రెండు చేతులను – బలమైన దానినీ విరిగినదానినీ – విరగగొట్టి, అతడి చేతిలోనుంచి ఖడ్గం పడిపోయేలా చేస్తాను, 23 ఈజిప్ట్‌వాళ్ళను ఇతర జనాలలోకి చెదరిగొట్టివేస్తాను, ఇతర దేశాలకు పారదోలుతాను. 24 నేను బబులోను రాజు చేతులను బలపరచి నా ఖడ్గం✽ అతడి చేతికిస్తాను, గాని ఫరో చేతులను విరిచివేస్తాను. ఫరో అతని సమక్షంలో చావుదెబ్బ తిన్నవాడిలాగా మూలుగుతాడు. 25 నేను బబులోను రాజు చేతులను బలంగా చేస్తాను, గాని ఫరో చేతులు పడిపోతాయి. నేను నా ఖడ్గం బబులోను రాజు చేతికిచ్చేటప్పుడు, అతడు దానిని ఈజిప్ట్‌మీద ఆడించేటప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు. 26 నేను ఈజిప్ట్‌వాళ్ళను ఇతర జనాలలోకి చెదరగొట్టివేస్తాను, ఇతర దేశాలకు పారదోలుతాను. అప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.”