12
1 ఆ రోజున✽ మీరు ఇలా అంటారు:“యెహోవా! నీవు నామీద కోపపడ్డా,
నీ కోపం✽ చల్లారింది.
నీవు నన్ను ఆదరించావు, గనుక నిన్ను స్తుతిస్తాను.
2 ఇదిగో వినండి, నా రక్షణ✽ దేవుడే.
నేను ఆయనను నమ్ముకొంటున్నాను.
భయపడను. యెహోవా, యెహోవా తానే నా బలం,
నా గానం. ఆయనే నాకు రక్షణ అయ్యాడు.”
“యెహోవాకు కృతజ్ఞత✽ అర్పించండి.
ఆయన పేర ప్రార్థన చేయండి.
ఆయన చేసినది జనాలలో తెలియజేయండి.
ఆయన పేరు ఘనమైనదని జ్ఞాపకం చేయండి.
5 ✝యెహోవాకు పాటలు పాడండి.
ఆయన గొప్ప కార్యాలు చేశాడు.
ఇది లోకం అంతటికీ తెలియాలి.
6 ✽సీయోను నివాసీ! ఆనందధ్వనులు బిగ్గరగా చేయి.
మీ మధ్య ఉన్న ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడు
మహా ఘనుడు.”