29
1 ✝ఎన్నిసార్లు హెచ్చరికలు విన్నా, తలబిరుసుగా మిగిలిపోయిన వ్యక్తికి అకస్మాత్తుగా నాశనం వస్తుంది. దానికి తిరుగు లేదు.2 సన్మార్గుల సంఖ్య అధికమైతే ప్రజలకు సంతోషం. దుర్మార్గులు పరిపాలిస్తే ప్రజలకు మూలుగులు.
3 ✝జ్ఞానాన్ని ప్రేమించే మనిషిమూలంగా అతడి తండ్రికి సంతోషం. వేశ్యాగమనం చేసేవాడు తన ఆస్తిని పాడు చేసుకుంటాడు.
4 ✝రాజు న్యాయాన్ని జరిగిస్తే దేశానికి సంక్షేమం. లంచం తీసుకొనేవారు దేశాన్ని పాడు చేస్తారు.
5 ✽ పొరుగువారిని ముఖస్తుతి చేసేవారెవరైనా వారి పాదాలకోసం వల వేస్తున్నారన్నమాట.
6 చెడ్డవాడి అతిక్రమ విధానాలలో ఉచ్చులు✽ ఒడ్డి ఉంటాయి. న్యాయవంతులు పాటలు పాడుకుంటారు. ఆనందం✽గా ఉంటారు.
7 ✝సన్మార్గులు బీదలకు న్యాయం చేకూరాలని కోరుతారు. దుర్మార్గులకు అలాంటిది ఏమీ తెలియదు.
8 ✽ వేళాకోళం చేసే వాళ్ళు పట్టణాన్ని రేపుతారు. జ్ఞానులు కోపాన్ని తొలగించివేస్తారు.
9 జ్ఞాని మూర్ఖుడితో వాదం పెట్టుకొంటే, మూర్ఖుడు ఊరికే రెచ్చిపోతూ ఉంటాడు, గేలి చేస్తాడు. నెమ్మది కలగదు.
10 ✽ హంతకులు నిర్దోషులను ద్వేషిస్తారు. వాళ్ళు నిజాయితీ పరుల ప్రాణాలు తీయడానికి చూస్తారు.
11 ✝మూర్ఖులు తమ కోపాన్నంతా బయట పెట్టుకుంటారు. జ్ఞానులు కోపాన్ని అదుపులో పెట్టుకొని అణచివేస్తారు.
12 ✽అబద్ధాలు వినిపించుకొనే రాజుకు దొరికే ఉద్యోగస్థులంతా దుర్మార్గులై ఉంటారు.
13 బీదలకూ, బీదలను బాధించేవాళ్ళకూ ఈ విషయంలో భేదం లేదు – వీరిద్దరి కండ్లకూ యెహోవాయే వెలుగును ప్రసాదిస్తాడు.
14 ✽పేదసాదలను న్యాయంతో పరిపాలించే రాజు సింహాసనం ఎప్పటికీ సుస్థిరంగా ఉంటుంది.
15 ✽బెత్తం, మందలింపు జ్ఞానాన్ని కలిగిస్తాయి. అదుపులో లేని పిల్లవాడు తల్లికి సిగ్గు కలిగిస్తాడు.
16 ✽ దుర్మార్గుల సంఖ్య పెరిగితే చెడుగు ఎక్కువ అవుతుంది. వాళ్ళ పతనాన్ని సన్మార్గులు కండ్లారా చూస్తారు.
17 ✽నీ కొడుకును క్రమశిక్షణతో ఉంచితే అతడిమూలంగా నీకు ఆదరణ కలుగుతుంది. నీ మనసుకు ఆనందం కలుగుతుంది.
18 ✽దర్శనం లేకపోతే ప్రజలు అదుపు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతారు. ధర్మశాస్త్రం ప్రకారం బ్రతికేవారు ధన్యజీవులు✽.
19 సేవకులకు మాటమాత్రంతో బుద్ధి రాదు. మాట గ్రహించినా వారు లోబడరు.
20 ✝ఆత్రంగా మాట్లాడేవారిని చూశావా? వారి కంటే మూర్ఖులు నయం – త్వరగా బాగు పడుతారు.
21 చిన్నప్పటినుంచీ గారాబంగా పెంచబడ్డ దాసుడు చివరికి పెంచినవాడి కొడుకుల లెక్కలోకి రావాలని ఆశిస్తాడు.
22 ✝కోపదారి జగడాలు రేపుతాడు. ముక్కోపి పెద్ద దోషానికి కారకుడవుతాడు.
23 ✝ఎవరి గర్వం వారినే హీనదశకు దించుతుంది. అణుకువగలవారు గౌరవం పొందుతారు.
24 ✝దొంగతో భాగం పంచుకొనేవాడు తనకు తానే శత్రువు. అలాంటివాడు ఒట్టుపెట్టుకొన్నా నిజం చెప్పడు.
25 మనుషులకు భయపడడం✽ మూలంగా మనుషులు ఉరిలో చిక్కుకుంటారు. యెహోవామీద నమ్మకం ఉంచేవారికి సంరక్షణ ఉంటుంది.
26 ✽పరిపాలన చేసేవారి ప్రాపకం కోసం అనేకులు ఆశిస్తారు. ప్రతి ఒక్కరికీ న్యాయం తీర్చేది యెహోవాయే.
27 ✽న్యాయవంతులంటే చెడ్డవాళ్ళకు గిట్టదు. దుర్మార్గులంటే నిజాయితీపరులకు గిట్టదు.