149
1 ✽యెహోవాను స్తుతించండి!యెహోవాకు క్రొత్త పాట✽ పాడండి!
భక్తుల సమాజంలో ఆయన స్తుతిగీతం పాడండి!
2 ఇస్రాయేల్‌ప్రజలు తమ సృష్టికర్త✽ను బట్టి
ఆనందిస్తారు గాక!
సీయోనుకు చెందినవారు తమ రాజు✽ను బట్టి
సంతోషిస్తారు గాక!
3 ✽ నాట్యం చేస్తూ ఆయన పేరును స్తుతిస్తారు గాక!
కంజరితోనూ తంతివాద్యంతోనూ
గానం చేస్తారు గాక!
4 తన ప్రజలంటే యెహోవాకు ఆనందం✽.
దీనావస్థ✽లో ఉన్న భక్తులకు రక్షణ
అలంకారంగా ప్రసాదిస్తాడాయన.
5 ✽తన భక్తులు ఈ ఘనమైన స్థితిలో సంతోషంతో
ఉప్పొంగిపోతారు గాక!
పడుకొన్నప్పుడు కూడా స్వరమెత్తి ఆనందంతో
పాడుతారు గాక!
6 ✽దేవుణ్ణి కీర్తించే మాటలు వారి నోట
వెలువడుతాయి గాక!
వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం
ఉంటుంది గాక!
7 ఇతర ప్రజలమీద ప్రతీకారం చేయడానికీ,
ఆ జనాలను దండించడానికీ,
8 వాళ్ళ రాజులను గొలుసులతో,
వాళ్ళ ఘనులను ఇనుప సంకెళ్ళతో బంధించడానికీ,
9 గ్రంథంలో రాసి ఉన్న తీర్పు వాళ్ళందరి మీదా
నెరవేర్చడానికీ తన భక్తుల చేతిలో
ఆ ఖడ్గం ఉంటుంది గాక!
ఆయన భక్తులందరికీ ఈ గౌరవం ఉంటుంది.
యెహోవాను స్తుతించండి!