150
1 ✽యెహోవాను స్తుతించండి!ఆయన పవిత్రాలయం✽లో దేవుణ్ణి స్తుతించండి!
ఆయన బలప్రభావాలను ప్రదర్శించే
విశాలాకాశం✽లో ఆయనను స్తుతించండి!
2 ఆయన బలమైన✽ క్రియాకలాపాలను బట్టి
ఆయనను స్తుతించండి!
ఆయన మహా గొప్పతనాన్ని✽ బట్టి ఆయనను
స్తుతించండి!
3 ✽ బూరలు ఊదుతూ ఆయనను స్తుతించండి!
తంతివాద్యాలు వాయిస్తూ ఆయనను స్తుతించండి!
4 కంజరితో, నాట్యంతో ఆయనను స్తుతించండి!
తంతి వాద్యం మీటుతూ, పిల్లనగ్రోవి మోగిస్తూ
ఆయనను స్తుతించండి!
5 తాళాలు మోగిస్తూ,
పెద్ద శబ్దం చేసే తాళాలు వాయిస్తూ,
ఆయనను స్తుతించండి!
6 ✽ఊపిరి ఉన్న ప్రతిదీ, ప్రతి ఒక్కరూ
యెహోవాను స్తుతించాలి.
యెహోవాను స్తుతించండి!