గాయకుల గాయకుడికి. దావీదు కీర్తన.
140
1 ✽✝యెహోవా, దుర్మార్గుల బారినుంచి నన్ను విడిపించు.దౌర్జన్యపరుల బారినుంచి నన్ను కాపాడు.
2 ✝వాళ్ళు తమ హృదయాలలో చెడు విషయాలు
కల్పిస్తారు.
ఎప్పుడూ యుద్ధం✽ రేపాలని చూస్తారు.
3 ✽ పాము నాలుకల్లాగా తమ నాలుకలకు పదును
పెట్టుకుంటారు.
వాళ్ళ పెదవుల క్రింద నాగు విషం ఉంది. (సెలా)
4 యెహోవా, దుర్మార్గుల చేతులలో పడకుండా
నన్ను కాపాడు.
దౌర్జన్యపరుల బారినుంచి నన్ను రక్షించు.
నేను కాలు జారిపడేలా చేయడానికి వాళ్ళు
ఉపాయం పన్నుతున్నారు.
5 ✝ఆ గర్విష్ఠులు నన్ను చేజిక్కించుకోవడానికి ఉరి,
ఉచ్చు చాటుగా పరిచారు.
దారి ప్రక్కనే వల వేశారు.
బోనులు ఉంచారు. (సెలా)
6 ✽ నేను యెహోవాతో ఇలా చెపుతున్నాను:
“నా దేవుడంటే నీవే!”
యెహోవా, నా విన్నపం చెవిని బెట్టు.
7 యెహోవా ప్రభూ! బలాఢ్యుడివైన నా రక్షకా!
యుద్ధం జరిగే రోజున నీవు నా తల పోకుండా
కాపాడేవాడివి.
8 యెహోవా! దుర్మార్గులు ఆశించేవాటిని✽
ప్రసాదించకు.
వాళ్ళ కుట్ర సఫలమయ్యేలా చేయకు.
వాళ్ళు మరీ గర్వంతో✽ రెచ్చిపోతారు. (సెలా)
9 ✽నా చుట్టూరా ఉన్న ఈ మనుషుల నెత్తి మీదికే వారి పెదవుల కీడు వస్తుంది గాక!
10 కణకణమండే నిప్పు రవ్వలు వాళ్ళ మీద
రాలుతాయి గాక!
తిరిగి లేవకుండా అగ్నిగుండంలో వాళ్ళు
కూలిపోతారు గాక!
దౌర్జన్యపరులను విపత్తులు వెంటాడి తరిమి పడదోస్తాయి గాక!
11 దూషించేవాళ్ళకు భూమి మీద స్థావరం లేకుండా
పోతుంది గాక!
లోతైన నీళ్ళలోకి పడిపోతారు గాక!
12 ✽దీనావస్థలో ఉన్న భక్తుల తరఫున యెహోవా
వాదిస్తాడు.
దరిద్రులకు ఆయన న్యాయం చేకూరుస్తాడు.
ఈ సంగతి నాకు తెలుసు.
13 ✽నిశ్చయంగా న్యాయవంతులు నీ పేరుకు
కృతజ్ఞతలు అర్పిస్తారు.
నిజాయితీపరులు నీ దగ్గరే ఉంటారు.