137
1 బబులోను✽ నదుల ప్రాంతంలో ఉండి మనంసీయోనును జ్ఞప్తికి తెచ్చుకొని ఏడ్చాం.
2 ✽అక్కడున్న నిరవంజి చెట్లకు మన తంతివాద్యాలు
వ్రేలాడవేశాం.
3 మనల్ని చెరపట్టినవాళ్ళు మనల్ని పాట
పాడాలన్నారు.
మనల్ని బాధ పెట్టిన వాళ్ళు
“సీయోను పాట ఒకటి పాడి వినిపించండి.
మమ్మల్ని ఉల్లసింపజేయండి” అని అడిగారు.
4 మనం ఇతర దేశంలో ఉండి యెహోవా పాటలు
ఎలా పాడడం?
5 ✽జెరుసలమా! నేను నిన్ను మరచిపోతే,
నా కుడిచెయ్యి తన నేర్పు
మరచిపోతుంది గాక!
6 నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకోకపోతే,
నా ఆనంద కారణాలలో ముఖ్యమైనదానికంటే
ఎక్కువగా నేను నిన్ను కోరుకోకపోతే,
నా నాలుక అంగిటికి అంటుకుపోతుంది గాక!
7 ✽ యెహోవా, ఎదోం ప్రజలు ఏమి చేశారో
జ్ఞాపకముంచుకో.
జెరుసలం పాడైపోయిన రోజు జ్ఞప్తి ఉంచుకో.
వాళ్ళు “దానిని నాశనం చెయ్యండి.
సమూల ధ్వంసం చెయ్యండి” అంటూ చాటించారు.
8 ✽నాశనం కాబోతున్న బబులోను కుమారీ!
నీవు మాకు చేసినదానిని బట్టి నీకు ప్రతీకారం
చేయబోయేవాడు ధన్యుడు.
9 నీ పసి పిల్లలను తీసుకొని, బండకేసి కొట్టి
ముక్కచెక్కలు చేయబోయేవాడు ధన్యుడు.