యాత్రల కీర్తన
134
1 ఇదిగో వినండి, యెహోవా సేవకులారా!
యెహోవా ఆలయంలో రాత్రి
నిలుచుండే సేవకులారా,
మీరంతా యెహోవాను కీర్తించండి.
2 పవిత్ర స్థలంవైపు మీ చేతులెత్తి యెహోవాను
కీర్తించండి.
3  ఆకాశాలనూ భూమినీ సృజించిన యెహోవా
సీయోనునుంచి మిమ్మల్ని దీవిస్తాడు గాక!