దావీదు రాసిన యాత్రల కీర్తన
133
1 ✽✽సోదరులు సమైక్యతతో ఉండడంఎంత మంచిది!
ఎంత మనోహరమైనది!
2 ✽ఈ సమైక్యత అహరోను తలమీద పోయబడ్డ
పరిమళ తైలంలాంటిది.
అతడి గడ్డం మీదుగా కారి అతడి
చొక్కా అంచువరకు దిగజారిన
ఆ పరిమళ తైలంలాంటిది.
3 సీయోను✽ కొండమీదికి దిగివచ్చే హెర్మోను
పర్వతం మంచు✽లాంటిది అది.
అక్కడ యెహోవా అనుగ్రహాన్ని
నియమించాడు.
ఆ అనుగ్రహం శాశ్వత జీవం.