దావీదు రాసిన యాత్రల కీర్తన
131
1 ✽✽ యెహోవా, నా హృదయం విర్రవీగడం లేదు.నా కండ్లు నెత్తికెక్కలేదు.
నాకు మించిన✽ విషయాల జోలికి,
గొప్పవాటి జోలికి నేను పోవడం లేదు.
2 ✽నా ప్రాణానికి నెమ్మది అలవరచుకొన్నాను.
దానిని అదుపులో ఉంచుకొన్నాను.
తల్లిపాలు విడిచిన పిల్ల తల్లిదగ్గర నిశ్చింతగా
ఉన్నట్టు నా ప్రాణం నాలో ప్రశాంతంగా ఉంది.
3 ✽ఇస్రాయేల్‌ప్రజలారా, ఇప్పటినుంచీ ఎప్పటికీ
మీరు యెహోవాలోనే ఆశాభావాన్ని
ఉంచుకోండి.