యాత్రల కీర్తన
130
1 ✽యెహోవా✽, అతి లోతైన స్థలాల్లో✽ ఉండినేను నిన్ను ప్రాధేయపడుతున్నాను.
2 ✝ప్రభూ! నా ప్రార్థన విను.
నా విన్నపాలు నీ చెవిని బెట్టు.
3 ✽యెహోవా, నీవు అపరాధాలు కనిపెట్టి చూస్తే,
ప్రభూ! ఎవరు నిలవగలరు?
4 అయితే క్షమాపణ నీ దగ్గర దొరుకుతుంది.
తద్వారా నీమీద భయభక్తులు కలగాలని
నీ ఆశయం.
5 యెహోవా కోసం నేను ఎదురు
చూస్తున్నాను✽.
నా ప్రాణం ఆయనకోసం ఎదురు
చూస్తూ ఉంది.
ఆయన మాటమీదే నా ఆశాభావం✽.
6 ✽కావలివాళ్ళు ఉదయం ఎప్పుడు వస్తుందా అని
చూస్తారు.
అంతకంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువుకోసం
ఎదురు చూస్తూ ఉంది.
7 ✽ఇస్రాయేల్‌ప్రజలారా, యెహోవామీద✽ ఆశాభావం
ఉంచుకోండి.
యెహోవా దగ్గర అనుగ్రహం లభిస్తుంది.
ఆయన దగ్గర విముక్తి సమృద్ధిగా దొరుకుతుంది.
8 ✝ఇస్రాయేల్‌వంశానికి దాని అపరాధాలన్నిటినుంచీ
ఆయన విడుదల ప్రసాదిస్తాడు.