సొలొమోను రాసిన యాత్రల కీర్తన
127
1 యెహోవా ఇంటిని కట్టించకపోతే
కట్టేవారి కృషి అంతా వృధా!
యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే
కావలివాడు మేలుకొని ఉండడం వృధా!
2 మీరు పొద్దున్నే లేచి, ఎంతో రాత్రి
గతించేవరకు మేలుకొని ఉండడం,
కష్టించి సంపాదించుకొన్న ఆహారం
తినడం వ్యర్థమే.
ఆయన తన ప్రియ ప్రజలకు నిద్ర
అనుగ్రహిస్తాడు.
3 పిల్లలు యెహోవా ప్రసాదించే
వారసత్వం.
సంతానం యెహోవా ఇచ్చే
బహుమానం.
4 యవ్వనకాలంలో పుట్టిన పిల్లలు బలవంతుడి
చేతిలోని బాణాలవంటివారు.
5 సంతానంతో తన అంబులపొది నింపుకొన్నవారు
ధన్యజీవులు.
గుమ్మం దగ్గర విరోధులతో వాదించేటప్పుడు
అలాంటివారికి అవమానం కలగదు.