యాత్రల కీర్తన
126
1 ✽యెహోవా సీయోను నగరవాసులను చెర✽నుంచితిరిగి తెచ్చినప్పుడు మనం కల కంటున్నామా
అనిపించింది.
2 మన నోరు నవ్వులతో నిండిపోయింది.
మన నాలుక ఆనంద ధ్వనులు చేసింది.
అప్పుడు ఇతర జనాలు ఇలా చెప్పుకొన్నారు:
“యెహోవా వీళ్ళకోసం గొప్ప క్రియలు చేశాడు.”
3 ✽ నిజంగా యెహోవా మనకోసం
గొప్ప క్రియలు చేశాడు.
మనం ఆనందభరితులం.
4 ✽దక్షిణ ప్రదేశాల ప్రవాహాలు పారినట్లు,
యెహోవా, మమ్మల్ని చెరనుంచి తిరిగి
రప్పించు.
5 ✽కన్నీళ్ళు విడుస్తూ విత్తనాలు చల్లేవారు
ఆనంద ధ్వనులు చేస్తూ పంట కోస్తారు.
6 విత్తనాలు చేతపట్టుకొని ఏడుస్తూ అటూ ఇటూ
వెళ్తూ ఉండేవాడు ఆనంద ధ్వనులతో
వచ్చితీరుతాడు.
తన పనలను మోసుకొని తిరిగి వస్తాడు.