యాత్రల కీర్తన
125
1 యెహోవామీద నమ్మకం ఉంచేవారు సీయోను
పర్వతంలాగా ఉంటారు. అది నిశ్చలం.
అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
2 జెరుసలం చుట్టూ పర్వతాలు ఆవరించి ఉన్నట్టు
ఇప్పటినుంచి ఎప్పటికీ యెహోవా తన
ప్రజలచుట్టూ ఆవరించి ఉంటాడు.
3 న్యాయవంతుల వారసత్వంమీద దుర్మార్గుల
రాజదండం నిలిచి ఉండదు.
న్యాయవంతులు అక్రమం చేయడానికి చేతులు
చాపకూడదని అందులో దేవుని ఆశయం.
4 యెహోవా, మంచివారికి మంచిని జరిగించు.
హృదయంలో నిజాయితీ గలవారికి మంచిని
జరిగించు.
5 చెడుగు చేసేవారిని యెహోవా పారదోలేటప్పుడు
తమ కుటిల మార్గాలకు తొలగిపోయిన వారిని
కూడా పారదోలుతాడు.
ఇస్రాయేల్‌ప్రజ మీద శాంతి ఉంటుంది గాక!