యాత్రల కీర్తన
123
1 ✽✽పరలోకంలో సింహాసనాసీనుడా!నీ వైపు నా తలెత్తి చూస్తున్నాను.
2 ✽దాసుల దృష్టి యజమాని చేతిమీదే.
దాసి దృష్టి యజమానురాలి చేతిమీదే.
అలాగే మన దృష్టి మన దేవుడు
యెహోవామీదే ఉంది.
ఆయన మనల్ని దయ చూచేవరకూ
అలాగే ఉంటుంది.
3 ✽యెహోవా, మేము ఎక్కువగా తిరస్కారానికి
గురి అయ్యాం.
మా పట్ల స్వార్థపరుల తృణీకారం,
గర్విష్ఠుల తిరస్కారం ఎక్కువైంది.
4 దయ చూడు, మమ్మల్ని దయ చూడు.