యాత్రల కీర్తన
120
1 ✽✝నా దీనావస్థలో నేను యెహోవాకు మొరపెట్టాను.ఆయన నాకు జవాబిచ్చాడు.
2 ✽యెహోవా, అబద్ధాలు పలికే పెదవుల నుంచి,
మోసం చేసే నాలుక నుంచి నన్ను కాపాడు.
3 ✽మోసం చేసే నాలుకా,
ఆయన నీకేం చేస్తాడో తెలుసా?
ఇక నీకేం జరిగిస్తాడో తెలుసా?
4 ఆయన బాణాలు తంగేడు నిప్పుల్లాంటివి.
అవి బలాఢ్యుడు ఎక్కుపెట్టే పదునైన బాణాలు.
అవే నీ మీదికి వేస్తాడాయన.
5 ✽అయ్యో, నేను మెషెక్‌జనం
మధ్య పరదేశిని.
నా కాపురం కేదార్‌వాళ్ళ డేరాల దగ్గర,
6 ✽ శాంతి అంటే గిట్టనివాళ్ళ దగ్గర నేను చాలా
కాలంనుంచి నివాసం ఉన్నాను.
7 నాకు కావలసినది శాంతి!
అయినా, నా నోట మాట వచ్చిందంటే,
వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతారు.