93
1 ✽ యెహోవా పరిపాలన చేస్తున్నాడు.వైభవం ఆయన ధరించిన వస్త్రం.
బలం నడికట్టుగా యెహోవా ధరించుకొన్నాడు.
భూమి దాని స్థానంలో సుస్థిరంగా ఉంది.
2 ✝మొదటినుంచి నీ సింహాసనం సుస్థిరంగా ఉంది.
కాలం ఉనికిలోకి రాకముందే నీవు ఉన్నావు.
3 ✽యెహోవా! వరదలు గొంతెత్తాయి,
వరదలు గొంతెత్తి ఘోషించాయి.
వరదలు హోరుమంటూ తమ అలలెత్తుతున్నాయి.
4 అనేక జనాల ఘోషను మించి,
మహా సముద్ర తరంగాలను మించి,
యెహోవా ఆకాశవీధిలో శక్తిమంతుడు.
5 ✽ యెహోవా, నీ శాసనాలు ఎన్నడూ తప్పనివి.
నిత్యమూ నీ ఆలయానికి యుక్తమైనది పవిత్రతే.