విశ్రాంతిదినం కోసం కీర్తన. ఒక పాట.
92
1 ✽✽యెహోవాకు కృతజ్ఞత అర్పించడం మంచిది.సర్వాతీతుడా, నీ పేరును కీర్తించడం మంచిది.
2 ✽పది తంతుల వాద్యంతో, సితారా స్వరంతో
3 ఉదయ కాలంలో నీ విశ్వసనీయతను
తెలియజేయడం మంచిది.
4 ✽యెహోవా, నీవు చేసిన దానిమూలంగా నాకెంతో
సంతోషం కలుగుతూ ఉంది.
నీవు నీ చేతులారా చేసిన పనులను బట్టి
నాకెంతో ఉల్లాసం.
5 ✝యెహోవా, నీ క్రియలు ఎంతో గొప్పవి.
నీ ఆలోచనలు మహా గంబీరమైనవి.
6 ✽పశుప్రాయులకు ఇవేమీ అర్థం కావు.
మూర్ఖులు ఈ విషయాలు తెలుసుకోలేరు.
7 ✽పచ్చని గడ్డి మొక్కలు మొలకెత్తినట్టు
దుర్మార్గులు తలెత్తుతారు.
చెడుగు చేసేవాళ్ళు వర్ధిల్లుతారు.
అయితే ఇదంతా వాళ్ళ శాశ్వత నాశనానికే.
8 ✽ యెహోవా, శాశ్వతంగా ఉన్నత స్థానం నీదే,
9 ✝యెహోవా నీ శత్రువులను చూడు.
నీ శత్రువులు నాశనమైపోతారు.
చెడుగు చేసేవాళ్ళంతా చెల్లా చెదురైపోతారు,
10 ✝అడవిదున్న కొమ్ముల్లాగా నా కొమ్మును
పైకి ఎత్తుతావు.
కొత్త తైలంతో నన్ను అభిషేకించావు.
11 ✝నాకోసం దారి కాచినవాళ్ళను నేను కన్నుల
పండుగగా చూశాను.
నాకు ఎదురు తిరిగిన దుర్మార్గులకు జరిగినది
నా చెవులారా విన్నాను.
12 ✽న్యాయవంతులు ఖర్జూరచెట్టులాగా చిగుళ్ళు
తొడుగుతారు.
లెబానోన్‌లోని దేవదారుచెట్టులాగా పెరుగుతారు.
13 వారు యెహోవా ఆలయంలో నాటబడి,
మన దేవుని ఆవరణాలలో వర్ధిల్లుతారు.
14 యెహోవా నిజాయితీగలవాడని వెల్లడి చేయడానికి
వృద్ధాప్యంలో కూడా వారు ఫలవంతంగా
ఉంటారు.
వారిలో సారం ఉంటుంది.
పచ్చపచ్చగా ఉంటారు.
15 యెహోవా నా ఆధారశిల✽.
ఆయనలో చెడు అంటూ ఏమీ లేదు✽.