కోరహు సంతతివారి కీర్తన. ఒక పాట.
87
1 పవిత్ర పర్వతాల పై ఆయన తన పునాది వేశాడు.
2 యాకోబు వంశీయులు నివసించే స్థలాలన్నిటికంటే
సీయోను ద్వారాలు యెహోవాకు
ప్రీతి పాత్రమైనవి.
3 దేవుని నగరమా, నీ గురించి చాలా గొప్ప
విషయాలు, చెప్పి ఉన్నాయి. (సెలా)
4 “రాహాబు, బబులోను నన్ను ఎరిగిన
జనాలలో ఉన్నాయని తెలియజేస్తాను.
ఇవిగో ఫిలిష్తీయ, తూరు, కూషు వీటిలో
ఒక్కొక్క దాని గురించి కూడా ఇది సీయోనులో
పుట్టినది అంటారు.”
5 సీయోను గురించి ఇలా కబుర్లాడుకొంటారు:
“ఆ జనం, ఈ జనం అందులో జన్మించాయి.
సర్వాతీతుడు దానిని సుస్థిరం చేస్తాడు.”
6 యెహోవా జనాలను నమోదు చేయిస్తూ ఇలా
అంటాడు:
“ఈ జనం సీయోనులో జన్మించింది.” (సెలా)
7 గాయకులు, వాయిద్యగాండ్లు “మా ఊటలన్నీ
నీలోనే ఉన్నాయి” అంటూ సంకీర్తనం చేస్తారు.