గాయకుల నాయకుడికి. కోరహు సంతతి వారి కీర్తన.
85
1 ✽✽యెహోవా! నీవు నీ దేశాన్ని దయతో చూశావు.యాకోబు వంశీకులు చెరలో ఉన్నప్పుడు నీవు
వారిని వెనక్కు రప్పించావు✽.
2 ✝నీ ప్రజల ఆపరాధాలు క్షమించావు.
వారి పాపాలన్నీ నీవు కప్పివేశావు. (సెలా)
3 ✽ కోపపడడం పూర్తిగా మానుకొన్నావు.
నీ కోపాగ్నిని చల్లార్చుకొన్నావు.
4 ✽మా రక్షణదాతవైన దేవా! మా వైపుకు మరలి రా!
మా మీద ఉన్న నీ కోపం చాలించు!
5 ✝ఎల్లప్పుడూ మామీద ఇలా కోపపడుతావా?
తరతరాలుగా నీ కోపం ఇలా పొడిగిస్తావా?
6 ✽నీ ప్రజలు నీమూలంగా ఆనందించేలా నీవు
మళ్ళీ మమ్మల్ని బ్రతికించవా?
7 యెహోవా! నీ అనుగ్రహం మాకు చూబెట్టు!
నీ రక్షణ మాకు అనుగ్రహించు!
8 యెహోవా దేవుడు ఏమి చెప్తాడో
అది నేను వింటాను✽.
ఆయన తన ప్రజలకు, తన భక్తులకు
శాంతి వాక్కులు పలుకుతాడు.
అయినా, వారు మళ్ళీ✽ మూర్ఖులు కాకూడదు.
9 ✽ఆయన అంటే భయభక్తులున్న వారికి ఆయన
రక్షణ అతి సమీపం.
తద్వారా మన దేశంలో మహత్యం ఉంటుంది.
10 ✽కృప, సత్యం కలుసుకొన్నవి.
న్యాయం, శాంతి ఒకదానికొకటి ముద్దెట్టుకొన్నాయి.
11 ✽ భూమిలో నుంచి సత్యం మొలకెత్తుతుంది.
ఆకాశం నుంచి న్యాయం క్రిందికి చూస్తుంది.
12 ✝యెహోవా మేలైనదాన్ని ఇస్తాడు.
మన భూమి ఫలిస్తుంది.
13 ✽ న్యాయం ఆయనకు ముందుగా నడుస్తుంది.
అది ఆయన అడుగులు మనకు మార్గంగా చేస్తుంది.