గాయకుల నాయకుడికి. యెదూతూనుకోసం. ఆసాపు కీర్తన.
77
1 నేను స్వరమెత్తి దేవునికి మొరలిడుతాను✽.నేను స్వరమెత్తుతాను. ఆయన నా మొర
ఆలకిస్తాడు.
2 ✽నా కష్టదశలో నేను ప్రభువును వెదికాను.
రాత్రి పూట నా చెయ్యి ఎడతెగకుండా
చాచి ఉంది.
నా ఆత్మ ఓదార్పును నిరాకరించింది.
3 నేను దేవుణ్ణి జ్ఞాపకం✽ చేసుకొని నిట్టూరు✽స్తున్నాను.
ధ్యానం మధ్యలో నా ఆత్మ నీరసించిపోయింది.
(సెలా)
4 ✽నీవు నా కనురెప్పలు వాలిపోనివ్వలేదు.
నేను మాట్లాడలేనంతగా కలవరపడుతున్నాను.
5 మునుపటి రోజులను,
గతించిన సంవత్సరాలను గురించి నేను
ఆలోచన చేశాను.
6 రాత్రి పూట నేను పాడిన పాటను జ్ఞాపకం
చేసుకొంటున్నాను.
నా హృదయంతో నేను మాట్లాడుకొంటున్నాను.
నా ఆత్మ శ్రద్ధగా అన్వేషిస్తూ ఉంది.
7 ✽ప్రభువు నన్ను ఎప్పటికీ త్రోసివేస్తాడా?
ఆయన ఇంకెప్పుడూ నన్ను సంతోషంతో
స్వీకరించడా?
8 ఆయన అనుగ్రహం ఎప్పటికీ గతించిపోయిందా?
తరతరాలకు ఆయన చేసిన వాగ్దానం
విఫలమయిందా?
9 దేవుడు దయ చూపడం మరిచిపొయ్యాడా?
ఆయన కోపపడి తన వాత్సల్యం కనబడకుండా
చేశాడా?
10 ✽అప్పుడు నేను ఈవిధంగా తలపోశాను:
ఇది నా బాధ.
కానీ, సర్వాతీతుడి కుడి చేతిలోని సంవత్సరాలు
స్ఫురణకు వస్తున్నాయి.
11 ✽యెహోవా చర్యలను తలచుకుంటాను.
దేవా, పూర్వం నీవు చేసిన అద్భుత కార్యాలను
జ్ఞాపకం చేసుకుంటాను.
12 ✝నీ కార్యకలాపం అంతా నేను ధ్యానం
చేసుకుంటాను.
నీ పనులను తలపోసుకుంటాను.
13 ✽దేవా, నీ మార్గం పవిత్రం.
మా దేవునిలాంటి మరో గొప్ప దేవుడు✽ ఏడీ,
ఎక్కడున్నాడు?
14 ✝దేవా, నీవే అద్భుత క్రియలు చేసేవాడివి.
జనాలమధ్య నీ బలప్రభావాలను నీవు
ప్రత్యక్షం చేశావు.
15 ✽చేయి ఎత్తి నీ ప్రజలను విడిపించావు.
యాకోబు యోసేపుల సంతతికి విడుదల
ప్రసాదించావు. (సెలా)
16 దేవా, జలాలు నిన్ను చూశాయి.
నిన్ను చూచి, భయపడిపొయ్యాయి.
జలాగాధాలు వణికిపొయ్యాయి.
17 మేఘాలు నీళ్ళు కుమ్మరించాయి.
ఆకాశం గర్జించింది.
నీ బాణాలు✽ బయలుదేరాయి.
18 నీ ఉరుముల మోత సుడిగాలిలో వినిపించింది.
నీ మెరుపులు లోకాన్ని వెలిగించాయి.
భూమి వణికింది, కంపించింది.
19 నీవు సముద్రంలో నడిచావు
నీ త్రోవలు మహా జలాలలో ఉన్నాయి.
నీవి గుర్తించరాని అడుగు జాడలు.
20 మోషే అహరోనులచేత మందలాంటి
నీ ప్రజలకు వెళ్ళవలసిన దారి చూపించావు.