గాయకుల నాయకుడికి. తంతివాద్యాలతో పాడతగ్గది. ఒక పాట.
67
1 ✽✽దేవుడు మమ్మల్ని దయ చూపి దీవిస్తాడు గాక!తన ముఖకాంతి మామీద ప్రకాశించేలా
చేస్తాడు గాక! (సెలా)
2 ✽భూమిమీద నీ మార్గం వెల్లడి అవుతుంది గాక!
సర్వ లోక ప్రజలు నీ విముక్తి తెలుసుకొంటారు గాక!
3 ✽దేవా! ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక!
ప్రజలంతా నిన్ను స్తుతిస్తారు గాక!
4 న్యాయంతో నీవు జనాలకు తీర్పు తీరుస్తావు.
లోక జనాలను పరిపాలన చేస్తావు.
జనాలు సంతోషించి ఆనంద ధ్వనులు
చేస్తారు గాక! (సెలా)
5 దేవా! ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక!
ప్రజలంతా నిన్ను స్తుతిస్తారు గాక!
6 ✽అప్పుడు భూమి దాని ఫలం ఇస్తుంది,
దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
7 దేవుడు మమ్మల్ని దీవిస్తాడు,
భూమి కొనలన్నిటికి ఆయనపట్ల భయభక్తులు
కలుగుతాయి.