గాయకుల నాయకుడికి. తంతివాద్యాలతో పాడతగినది. దావీదుది.
61
1 దేవా, నా మొర ఆలకించు.నా ప్రార్థన విను.
2 నా హృదయం క్రుంగిపోయినప్పుడు భూమి
అంచు✽నుంచి నీకు ఆక్రందన చేస్తాను.
నాకంటే ఎత్తుగా ఉన్న బండమీదికి
నన్ను ఎక్కించు.
3 నీవే నాకు ఆశ్రయం✽గా ఉన్నావు,
శత్రువుల ఎదుట బలమైన కోట✽లాంటివాడవు.
4 ✽యుగాల తరబడి నీ నివాసంలో నేనుంటాను.
నీ రెక్కల✽ చాటున నేను ఆశ్రయిస్తాను. (సెలా)
5 ✽దేవా, నేను చేసిన శపథాలను✽ నీవు విన్నావు.
నీ పేరంటే భయభక్తులు గలవారి వారసత్వం✽లో
నన్ను పాలిభాగస్తుణ్ణి చేశావు.
6 ✽రాజు జీవిత కాలాన్ని నీవు పొడిగిస్తావు.
రాజు తరతరాలుగా ఉంటాడు.
7 దేవుని సమక్షంలో అతడు శాశ్వతంగా ఉంటాడు.
అనుగ్రహం, సత్యం అతనికి రక్షకంగా నియమించు.
8 ✽నేను ఎల్లప్పుడూ నీ పేరును సంకీర్తనం చేస్తాను.
ప్రతిరోజూ నేను మ్రొక్కుకొన్నది నీకు
సమర్పించుకొంటాను.