గాయకుల నాయకుడికి. దావీదు బత్‌షెబ దగ్గరికి వెళ్ళిన తరువాత, నాతాను ప్రవక్త అతడి దగ్గరికి వచ్చాక, అతడు ఈ కీర్తన రాశాడు.
51
1 ✽✽దేవా, నీ అనుగ్రహం ప్రకారం నన్ను కరుణించు!నీ అధిక వాత్సల్యం చొప్పున నా అక్రమ
కార్యాలను తుడిచివెయ్యి!
2 ✽నా అపరాధంనుంచి నన్ను బాగా కడుగు!
నా పాపం నుంచి నన్ను శుద్ధి చెయ్యి!
3 ✽నా అక్రమాలేవో నాకు తెలుసు.
నా పాపం ఎప్పుడూ నా ఎదుటే ఉంది.
4 ✽నీకు, నీకు మాత్రమే విరుద్ధంగా నేను పాపం చేశాను.
నీ దృష్టిలో చెడుగుగా కనబడేది నేను చేశాను.
అందుచేత నీవు మాట్లాడేటప్పుడు
న్యాయవంతుడుగా✽ కనిపిస్తావు.
నీవు తీర్పు చెప్పేటప్పుడు పవిత్రుడుగా గోచరిస్తావు.
5 ✽నేను భ్రష్ట స్వభావంతో పుట్టాను.
నా తల్లి నన్ను గర్భం ధరించినప్పటినుంచీ
నేను పాపిని.
6 ✽నీవు నా అంతరంగంలో నిజాయితీ కోరుతావు.
జ్ఞానమేదో నా ఆంతర్యంలో నాకు తెలియజేస్తావు.
7 హిస్సోప్✽రెమ్మతో నాకు పాపపరిహారం చెయ్యి.
అప్పుడు నేను శుద్ధంగా ఉంటాను.
నన్ను కడుగు. అప్పుడు నేను మంచు✽కంటే
కూడా తెల్లగా అవుతాను.
8 ✽ఆనందం, సంతోషం కలిగించే మాట నాకు
వినిపించు!
నీవు విరిచిన ఎముకలను ఆనందించనియ్యి.
9 నా పాపాలనుంచి నీ ముఖం అటు త్రిప్పుకో!
నా దోషాలన్నీ తుడిచివెయ్యి✽!
10 ✽దేవా, నాకు శుద్ధ హృదయం✽ కలిగించు!
మళ్ళీ ఆత్మకు నిబ్బరం నాకు దయ చెయ్యి!
11 ✽నీ సమక్షంలో నుంచి నన్ను గెంటివేయకు!
నీ పవిత్రాత్మను నా దగ్గరనుంచి తీసివేయకు!
12 నీవిచ్చే పాపవిముక్తివల్ల కలిగే ఆనందం✽
తిరిగి నాకు చేకూర్చు!
విధేయతగల మనసు✽ను ప్రసాదించి నేను
దృఢంగా నిలబడేలా చెయ్యి!
13 ✽అప్పుడు అక్రమకారులకు నీ విధానాలు
ఉపదేశిస్తాను.
పాపులు నీ వైపు తిరుగుతారు.
14 ✽దేవా, నన్ను రక్షించే దేవా!
రక్తం ఒలికించిన అపరాధంనుంచి
నన్ను విడుదల చెయ్యి!
అప్పుడు నా నాలుక నీ న్యాయాన్ని
సంకీర్తనం చేస్తుంది.
15 ✽ప్రభూ! నా పెదవులను తెరువు!
అప్పుడు నా నోరు నీ ప్రఖ్యాతిని చాటుతుంది.
16 ✝నీకు బలి అంటే ఇష్టం లేదు.
నీకు ఇష్టం ఉంటే నేను అర్పించేవాణ్ణే.
హోమం వల్ల నీకు సంతోషం కలగదు.
17 ✽ దేవునికి కావలసిన బలులు విరిగిన మనసు.
దేవా, విరిగి నలిగిపోయిన హృదయాన్ని
నీవు నిరాకరించవు.
18 ✽సీయోనుకు నీ దయగల సంకల్పం ప్రకారం
మేలు చేకూర్చు.
జెరుసలం గోడలను కట్టించు.
19 అప్పుడు సరైన బలులు, సర్వాంగ హోమాలు
నీకు ప్రీతికరమవుతాయి.
నీ బలిపీఠంమీద కోడెలను అర్పించడం జరుగుతుంది.