గాయకుల నాయకుడికి. కోరహు సంతతివారి కీర్తన.
47
1 సర్వలోక ప్రజలారా, చప్పట్లు కొట్టండి.
గొంతెత్తి దేవునికి ఆనంద ధ్వనులు చెయ్యండి.
2 యెహోవా సర్వాతీతుడు, భయభక్తులకు పాత్రుడు.
లోకమంతటి మీదా ఆయన గొప్ప రాజు.
3 ఇతర ప్రజలను మన వశం చేస్తాడు.
జనాలను మన పాదాల కింద
అణచివేస్తాడు.
4 మన వారసత్వాన్ని ఆయన
మనకు పంచి ఇస్తాడు.
ఆయనకు ప్రియమైన యాకోబు ప్రజల
దివ్యమైన వారసత్వమది. (సెలా)
5 దేవుడు జయధ్వనులతో పైకి వెళ్ళాడు.
బూర మోగుతూ ఉంటే యెహోవా పైకి
ఎక్కిపొయ్యాడు.
6 స్తుతి పాటలు పాడండి,
దేవునికి స్తుతి పాటలు పాడండి.
సంకీర్తనం చేయండి.
మన రాజుకు సంకీర్తనం చేయండి.
7 లోకమంతటికీ రాజు దేవుడే.
కీర్తన పాడండి.
8 దేవుడు తన పవిత్ర సింహాసనం మీద
కూర్చుని ఉన్నాడు.
దేవుడు లోక ప్రజలను పరిపాలిస్తున్నాడు.
9 ఇతర ప్రజల ఘనులు అబ్రాహాము యొక్క
దేవుని ప్రజతో సమకూడి ఉన్నారు.
ఇహలోకంలోని డాళ్ళు దేవునివి.
ఉన్నత స్థానం ఆయనదే.