గాయకుల నాయకుడికి. కోరహు సంతతివారిది. రాగం: అలామోత్. ఒక పాట.
46
1 దేవుడు మనకు ఆశ్రయం,✽ బలం.✽అగచాట్లలో ఆయన ఎన్నడూ మనకు తోడు.
2 అందుచేతే భూతలానికి మార్పులు వచ్చినా,
సముద్రం లోతుల్లో పర్వతాలు మునిగిపోయినా,
దానికి మేమేమీ భయ✽పడము.
3 సముద్రం ఘోషించనియ్యి.
అలలు నురుగు కట్టనియ్యి.
సముద్రం పొంగి పర్వతాలను కదిలించనియ్యి.
4 ✝అది ఒక నది.
దాని శాఖలు దేవుని నగరానికి
సంతోషం కలిగిస్తాయి.
5 ✽ ఆ నగరంలో దేవుడు ఉన్నాడు.
దాన్ని ఏదీ కదల్చదు.
తెల్లవారగానే దేవుడు దానికి సహాయం చేస్తాడు.
6 ✽ జాతులు ఘోషించాయి.
రాజ్యాలు కదిలిపోయాయి.
ఆయన తన స్వరం వినిపించాడు:
భూమి కరిగిపోయింది.
7 ✽సేనల ప్రభువు✽ యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు యొక్క దేవుడు✽ మనకు కోటగా
ఉన్నాడు. (సెలా)
8 ✽యెహోవా చేసేదేమిటో వచ్చి చూడు.
ఆయన భూతలంపై శిథిలాలను కలిగించేవాడు.
9 ✝భూమికి ఆ కొన నుంచి ఈ కొనదాకా యుద్ధాలు
జరగకుండా ఆపగలవాడు కూడా ఆయనే.
విండ్లను విరుస్తాడు.
ఈటెలను తెంచివేస్తాడు.
రథాలను కాల్చివేస్తాడు.
10 ✽దేవుడు అంటాడు “ఊరుకోండి
నేనే దేవుణ్ణని తెలుసుకోండి.
జనాలలో నాకు ఉన్నత స్థానం ఉంటుంది.
భూలోకంలో నాదే ఉన్నత స్థానం”.
11 సేనల ప్రభువు యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబుయొక్క దేవుడు మనకు కోటగా
ఉన్నాడు. (సెలా)